Indian Ralways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుకుంది. ప్రతి రోజూ 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా సర్వీసులు అందిస్తున్నాయి. వీటిలో రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్లు, మెయిల్ ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, లోకల్, డిఎంయు కోచ్‌లు సహా అన్ని క్లాస్ లకు సంబంధించిన పలు రకాల రైళ్లు ఉన్నాయి. భారతీయ రైల్వే సంస్థ సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతుంది. అటు టికెట్ల అమ్మకం ద్వారానూ బాగానే డబ్బు సంపాదిస్తుంది. ప్రయాణీకులకు 46 శాతం తగ్గింపుతో రైల్వే టికెట్లు అందిస్తున్నారు. జాతీయ రవాణా సంస్థ ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణికులకు మొత్తం రూ. 56,993 కోట్ల సబ్సిడీని అందిస్తుంది.
దేశంలో అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైలు
ఇక భారతీయ రైల్వేలోని పలు రైళ్లు అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. వాటిలో ఏ రైలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తుందో తెలుసా? దేశంలో అత్యధికంగా ఆదాయం పొందుతున్న రైలు ఉత్తర రైల్వేకు చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్. ఇండియన్ రైల్వే డేటా ప్రకారం.. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్- కెఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ వరకు నడిచే కెఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్ దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వేకు ఈ రైలు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.
దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రైళ్లు
⦿ న్యూఢిల్లీ- కోల్ కతా మధ్య నడిచే సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ రూ.1,28,81,69,274 సంపాదించింది. అత్యధిక ఆదాయం సంపాదించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది కాలంలో ఈ రైలు 509,164 మంది ప్రయాణికులను తీసుకెళ్లింది.
⦿ 2022-23 ఆర్థిక సంవత్సరంలో న్యూఢిల్లీ- అస్సాంలోని దిబ్రూఘర్ మధ్య నడిచే దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ దేశంలో మూడవ అత్యంత లాభదాయక రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఏడాదిలో రూ.1,26,29,09,697 సంపాదించింది. 474,605 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
Read Also: ఇక ఇండియాలో కదిలే ఇల్లు.. ఉబెర్ సరికొత్త సర్వీస్.. ముందు ఈ నగరాల్లోనే!
⦿ ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయం అందిస్తున్న రైళ్లలో నాల్గవ స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో న్యూఢిల్లీ- ముంబై సెంట్రల్ నుండి 4,85,794 మంది ప్రయాణికులను తీసుకెళ్లిన ఈ రైలు.. రూ.122 కోట్లు సంపాదించింది. ఇక వందే భారత్ లాంటి కొత్త ఆధునిక రైళ్లు దేశ రైల్వే నెట్ వర్క్ ను బలోపేతం చేశాయి. కానీ, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు ఇప్పటికీ భారత రైల్వేకు వెన్నెముకగా ఉన్నాయి.
Read Also: రైలులో చైన్ లాగితే జరిమానా ఎంత? ఎలాంటి సందర్భాల్లో లాగాలి?