IndiGo flight: ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వడగళ్ల వాన బీభత్సం విమానం భారీ కుదుపు లోనయ్యింది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.
దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. బుధవారం రోజు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కేవలం దక్షిణాది మాత్రమే కాకుండా ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్ సహా వివిధ రాష్ట్రాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీనికితోడు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.
అసలేం జరిగింది?
వర్షానికి ముందు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తోంది ఓ ఇండిగో విమానం. వడగళ్లు వానకు గాల్లో భారీ కుదుపులకు లోనైంది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్ దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటన సమయంవల్ల ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నార్మల్‌గా వాతావరణం బాగా లేనప్పుడు విమానాలు కొద్ది గంటల సేపు నిలిపి వేస్తారు. కాకపోతే ఇండిగో విమానం విషయంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు భారీ వర్షం పడింది. అదే సమయంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో 6E2142 విమానం బయలు దేరింది.
ALSO READ: వందేభారత్ రైలుకు తప్పిన పెను ప్రమాదం, అసలేం జరిగింది?
వర్షం వల్ల బీభత్సం జరగడంతో వెంటనే పైలట్ శ్రీనగర్ ATCకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానం ల్యాండింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఘటనలో విమానం ముక్కు దెబ్బతిన్నప్పటికీ, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్టు శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్ జావేద్ అంజుమ్ తెలిపారు. ఆ సమయంలో విమానంలో 227 మంది ప్రయాణికులు ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఆ విమానంలో ఉన్నారు. వారిలో సాగరిక ఘోష్, డెరెక్ ఓ బ్రెయిన్, మమతా బాలా ఠాకూర్, నదిముల్ హక్ ట్రావెల్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో దాడుల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. శ్రీనగర్, పూంచ్, రాజౌరిలను సందర్శించనున్నారు.
శ్రీనగర్ నుండి తిరిగి రాత్రి 7 గంటల సమయంలో ఇండిగో విమానం ఢిల్లీకి రావాల్సివుంది. అయితే రాత్రి తొమ్మిదిన్నర వరకు శ్రీనగర్ నుంచి బయలుదేరలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు చెప్పాయి. శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్. ప్రయాణీకులకు మరణానికి దగ్గరగా ఉన్న అనుభవమని అన్నారు. దీన్ని తాము దగ్గరగా చూశామన్నారు.
విమానం ఒక వైపు నుండి మరొక వైపుకు ప్రమాదకరంగా స్థితికి వచ్చినప్పుడు కొందరు భోజనాలు చేస్తున్నారు. మరికొందరు అరుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. విమానాన్ని సురక్షితంగా కిందినందుకు పైలట్‌కు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ప్రయాణీకుడికి అత్యంత భయంకరమైన అనుభవమని చెప్పారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత దాని ముక్కు ఊడిపోయిందని, దాన్ని చూశామన్నారు.
We had a narrow escape from Delhi to Srinagar flight indigo. Special thanks to the captain and cabin crew. @indigo @GreaterKashmir @RisingKashmir pic.twitter.com/KQdJqJ7UJz
— I_am_aaqib (@am_aaqib) May 21, 2025
We a delegation of 5 public representatives from Bengal @derekobrienmp @MdNadimulHaque6 Mamata Thakur , Manas Bhuyan and myself have come to Kashmir in empathy and solidarity with the border villages of J&k where so many civilians lost their lives to cross border shelling. pic.twitter.com/18f6N2hl6s
— Sagarika Ghose (@sagarikaghose) May 21, 2025