BigTV English

Heavy Rains: దంచికొట్టిన వాన.. ఢిల్లీ అతలాకుతలం

Heavy Rains: దంచికొట్టిన వాన.. ఢిల్లీ అతలాకుతలం

Heavy Rains: ఢిల్లీలో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్‌లో వడగళ్ల వాన పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి.


తృటిలో తప్పిన ప్రమాదం

ఈదురుగాలు, వర్షం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి. అయితే.. పరిస్థితి ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు.. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌‌లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో విమానం ఈ వడగండ్ల వానలో చిక్కుకుంది.


ఇండిగోలో 227 మంది..

ఈ వాన తీవ్రతకు విమానం ముందుభాగం దెబ్బతింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురైయ్యారు. ప్రమాదం సమయంలో విమానంలో 227 మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చి సేఫ్ ల్యాండింగ్ కు చర్యలు చేపట్టారు. చివరకు బుధవారం  సాయంత్రం ఆరున్నరకు విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది.

చురుగ్గా నైరుతి పవనాలు

ఇదిలా ఉంటే.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిన అకాల వర్షాలు

మార్కెట్‌ యార్డులు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన దాన్యం వరద నీటిలో కొట్టుకొపోయింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట, ఖానాపురం మండలాల్లో 20 టన్నులకుపైగా ధాన్యం తడిసింది. తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల్లోకి నీరు చేరింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయాయి. లారీల కొరతతో మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో కూడా వాన బీభత్సం

హైదరాబాద్‌లో కూడా వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది.

Also Read: ఏపీ, తెలంగాణ భారీ వర్ష సూచన.. విశాఖలో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం

భారీవర్షాల హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

ఇవాళ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ రాష్ట్రమంతటా వానలు పడతాయని సూచించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడూ సమీక్షలు జరుపుతూ ప్రజలను అప్రమ్తతం చేయాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో రోడ్లపై నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×