Brahmamudi serial today Episode: రాజ్, కావ్య దగ్గరకు వెళ్లి తను రాయించుకుని తీసుకు వచ్చిన లెటర్ ఇస్తాడు. లెటర్ తీసుకుని కావ్య చదివి నవ్వుకుంటుంది. దీంతో రాజ్ నవ్వుతూ ఎలా అనిపిస్తుంది. మనసు పులకరించిందా..? కళ్లు కాళ్లతో కలిసి నాతో ఏడడుగులు వేయాలనిపిస్తుందా..? నా చేతి వేళిని పట్టుకుని ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూడాలనిపిస్తుందా..? అని అడగ్గానే.. అనిపిస్తుంది.. తప్పకుండా అనిపిస్తుంది. కాకపోతే వెళ్లి అప్పుకు ఈ లెటర్ ఇచ్చారంటే తప్పకుండా అనిపిస్తుంది అంటూ కావ్య చెప్పగానే.. అప్పుకా..? చీ నేనెందుకు ఇస్తానండి అంటాడు రాజ్. ఎందుకంటే ఇది రాసింది కవి గారు కాబట్టి అంటుంది కావ్య. షాక్ అయిన రాజ్ వెంటనే ఆ మాటలన్నీ నావి అని చెప్తాడు. కానీ రాసింది మాత్రం కవిగారు అంటుంది కావ్య. ఆ విషయం మీకెలా తెలుసు అని అడుగుతాడు రాజ్.
దీంతో లెటర్ చూపిస్తూ ఇందులో ఇట్లు మీ కళ్యాణ్ అని రాసి ఉంది. మీ మాటలను కూడా పక్క వాళ్ల దగ్గర కాపీ కొట్టారంటేనే అర్థం అవుతుంది మీది ఎంత గొప్ప మనసో అంటూ తిడుతూ వెళ్లిపోతుంది. దీంతో రాజ్ కోపంతో కళ్యాణ్ మీదకు వెళ్తాడు. కళ్యాణ్ తప్పించుకుని వెళ్లిపోతుంటే పట్టుకుని కొడుతుంటే.. అపర్ణ, ఇంద్రాదేవి వచ్చి ఏమైంది అని అడుగుతారు. రాజ్ జరిగి మొత్తం చెప్పగానే.. అపర్ణ, ఇంద్రాదేవి నవ్వుకుంటారు. దీంతో రాజ్ ఇరిటేటింగ్‌గా ఏంటి నవ్వుతున్నారు అని అడుగుతాడు. దీంతో ఇంద్రాదేవి నవ్వుతూ మా ఐడియాలన్నీ ముసలి ఐడియాలు.. ఔట్ డేటేడ్ అయిపోయాయి. యూత్‌ఫుల్‌గా ఆలోచించి ఇంప్రెస్ చేస్తా అన్నావుగా ఇలానేనా ఇంప్రెస్ చేసేది అంటుంది. ఇప్పటికైనా అర్థం అయిందా మాది ఓల్డే అయినా గోల్డేరా..? అంటుంది అపర్ణ. ఊరికే అన్నారా..? పెద్దల మాట చద్ది మూట అని ఇంద్రాదేవి అనగానే.. కరెక్టుగా చెప్పారు నాన్నమ్మ మిమ్మల్ని పక్కన పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అంటాడు రాజ్. ఇప్పుడు మీరే సాయం చేయాలి అంటాడు.
కిటికీలోంచి అంతా గమనిస్తున్న కావ్య నాకోసం మీరు పడుతున్న తపన, కష్టం థ్రిల్ గా ఉందని మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్యకు యామిని ఫోన్ చేస్తుంది. ఏంటి నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడని తెగ సంబరపడిపోతున్నావా..? అంటుంది. దీంతో కావ్య చూశావా నువ్వే నా మొగుడు అని ఒప్పుకున్నావు. చివరికి అదే నిజం అవుతుంది అన ఇచెప్పగానే దాన్ని గతంగా మార్చి భవిష్యత్తులో రాజ్‌ను నా మొగుణ్ని చేసుకోవడానకి కదా నేను ప్రయత్నిస్తున్నాను అంటుంది యామిని. అది అవదు కదా అంటుంది కావ్య. దీంతో అవుతుందమ్మా… ఏదో ఒక్కరోజు నీకోసం వచ్చాడని అంత కాన్ఫిడెంట్ పనికిరాదమ్మా..? అంటూ యామిని చెప్పగానే.. ఒక్కరోజా ఆయన నాకు వేసిన మూడు ముళ్ల సాక్షిగా ఇవాళ మూడో రోజు. పైగా నాకు మూడు బహుమతులు కూడా ఇచ్చాడు. రాక్షసుడు ఎంత బలవంతుడు అయినా చివరికి ఆ దేవుడి చేత అంతం అవ్వాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది.
యామిని కోపంగా రుద్రాణికి కాల్ చేస్తుంది. ఊరికే ఎందుకు కాల్ చేస్తున్నావు.. అంటూ రుద్రాణి తిడుతుంది. దీంతో యామిని నేను మరో కొత్త ఐడియా చెబుదామని కాల్ చేశానని చెప్తుంది. మళ్లీ కొత్త ఐడియానా..? ఏంటో చెప్పు అంటుంది రుద్రాణి. జనాభా లెక్కల కోసం అంటూ నా మనిషి వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తికి నువ్వు సపోర్టుగా మాట్లాడు అంతే చాలు నిజం వాళ్లే చెప్తారు అంటుంది యామిని. రుద్రాణి సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. తర్వాత రాజ్ పాట పెట్టుకుని డాన్స్ చేస్తాడు అందిరితో కలిసి డాన్స్ చేయిస్తాడు. రాజ్ కామెడీగా డాన్స్ చేయడంతో కావ్య నవ్వుతుంది. దీంతో కావ్య నవ్వింది అనుకుంటూ రాజ్ ఎగిరి గంతేస్తాడు. తర్వాత అందరూ హ్యాపీగా ఉన్న టైంలో యామిని పంపించిన వ్యక్తి వస్తాడు తాను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానని చెప్తాడు. ప్రకాష్ అందిరినీ పిలుస్తాడు.
అందరూ వచ్చాక ఒక్కోక్కరి గురించి చెప్తుంటారు. ఇంతలో సుభాష్ ను మీ పిల్లలు అంటూ అడగ్గానే.. అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంతలో రాజ్ నేను చెప్తాను. వాళ్ల అబ్బాయి ఉండేవాడు. ఇప్పుడు లేడు.. అని చెప్తాడు. లేడంటే అని ఆ వ్యక్తి అడగ్గానే.. లేడంటే అలిగి వెళ్లిపోయాడు అంటాడు. అందరూ రిలాక్స్ అవుతారు. వచ్చిన వ్యక్తి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపి అదేంటి వదిన కళావతి గురించి చెప్పలేదు అంటుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఏంటి అలా చూస్తున్నారు.. ఏంటి కళావతి మీ అత్తయ్య మర్చిపోతే నువ్వైనా చెప్పొచ్చు కదా అంటూ ఈ అమ్మాయి పేరు కళావతి.. అని రుద్రాణి చెప్పగానే.. ఈవిడ ఈ ఇంటికి ఏమవుతారు అని ఆవ్యక్తి అడగ్గానే అందరూ మరోసారి షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?