BigTV English

Tirupati: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. 40 నిమిషాలు గాల్లోనే, టెన్షన్ పడిన ప్రయాణికులు

Tirupati: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. 40 నిమిషాలు గాల్లోనే, టెన్షన్ పడిన ప్రయాణికులు

Tirupati:  ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది‌క్షణాలకే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక కాసేపు టెన్షన్ పడ్డాడు పైలట్. దాదాపు 40 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి మళ్లీ రేణిగుంట ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.


అహ్మదాబాద్ ఘటన తర్వాత రోజుకో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం రేణిగుంట నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి  రాత్రి ఎనిమిది గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాలకే సాంకేతిక సమస్య తలెత్తింది.

ఏం చెయ్యాలో తెలియక కాసేపు విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించాడు పైలట్. ల్యాండింగ్‌కు క్లియరెన్స్ రావడం ఆలస్యం కావడంతో గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో ఏం జరగుతుందో తెలియక విమానంలో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. అంతా ఓకే అయిన తిరిగి మళ్లీ రేణిగుంటలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.


ఏసీలు పని చేయకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు హైదరాబాద్ ట్రిప్‌ని రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఉన్నట్లుండి విమాన సర్వీసు రద్దుకావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో విమానాశ్రయంలో ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణికులు.

ALSO READ: ఆ లైసెన్స్ ఉంటే చాలు.. యూఏఈ రోడ్లపై దూసుకెళ్లొచ్చు

తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఇండిగో తెలిపింది. కేవలం ఇండిగో విమానం మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో ఎయిరిండియా మిగతా సంస్థల విమానాలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

ప్రతీ రోజు ఈ విధంగా సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు ఆయా విమాన సంస్థలపై రుసరుసలాడుతున్నారు. ఇదేకాదు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు స్పైస్ జెట్ విమానం వచ్చింది. తిరిగి వెళ్లే క్రమంలో ఆ విమానం మొరాయించడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు.

 

 

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×