Gundeninda GudiGantalu Today episode july 21 st: నిన్నటి ఎపిసోడ్ లో.. కస్టమర్లను కారులో ఎక్కించుకొని బాలు శృతి డబ్బింగ్ చెప్తున్న స్టూడియో దగ్గరకు వెళ్తాడు. అరే ఇది మా డబ్బుడమ్మ పనిచేసే స్టూడియో లాగా ఉంది అనేసి అనుకుంటాడు. కస్టమర్లు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు డబ్బులు పోయినా టెన్షన్లో వెళ్లిపోయినట్టున్నారు ఒకసారి వెళ్లి అడిగి తీసుకోవడం మంచిదని బాలు అనుకుంటాడు. ఒక అమ్మాయి లోపలికి వెళ్లగానే ఇక్కడ పర్స్ ఉంది.. నువ్వే తీసావు కదా మర్యాదగా ఆ పర్స్ ఎక్కడుందో చెప్పు అని శృతిని నిలదీస్తుంది. నీకు ఎంత దైర్యం నన్ను దొంగ అంటావా? బాలు మళ్లీ సీరియస్ అవుతాడు. ఆ పర్స్ తీసింది ఎవరో కనిపెడతాడు. వాళ్లకు పర్స్ ఇవ్వగానే శృతికి సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నువ్వు దొంగతనం చేయలేదని నీకు తెలుసు అందుకే వాళ్ళ దొంగ అనగానే నీకు కోపం వచ్చింది మీ నాన్నను మీ నాన్న అలానే అన్నాడు కదా మరి నాకు కోపం రాకుండా ఉంటుందా అని శృతి తో నిదానంగా మర్యాదగా మాట్లాడుతాడు. మీ నాన్న కావాలని ప్రతిదానికి నాతో గొడవ పడేలా చేయాలని అనుకున్నాడు. మీ నాన్న నిన్ను రవిని అక్కడే ఉంచేందుకు ప్లాన్ చేశాడు అది మీరు అర్థం చేసుకుంటే మంచిది.. చదువుకున్న అమ్మాయివి కదా ఆ మాత్రం మీకు అర్థం కాదా.. మీనా ను మీ నాన్న దొంగ అనడం వల్ల నేను కొట్టాను.
నా మీద మీకు కోపం ఉండాలి అంతేగాని నా తమ్ముడు ఏం చేశాడు. ఎందుకు దూరం పెడుతున్నావ్ అని బ్రతిమలాడుతాడు బాలు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా..? ఇంటికి రాలేక అటు నీ దగ్గరికి రాలేక.. ఆ హోటల్ రెస్టారెంట్లో ఓ గదిలో బొద్దింకలు ఎలకల మధ్య పడుకుంటున్నాడు. వాడిని ఎందుకు దూరం పెట్టాలి? మీరిద్దరూ మంచిగా ఉంటే మేం కూడా మంచిగా ఉంటాం కదా అని బాలు చాలా ప్రశాంతంగా శృతికి వివరంగా చెప్తాడు.
మనోజ్ తన పార్క్ ఫ్రెండ్ తో కలిసి ఒక స్వామిజీ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆయనతో వింతగా ప్రవర్తిస్తాడు. ఆయనను నువ్వు ఎన్ని ఏళ్ల నుంచి ఇలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఆయన సీరియస్ అవుతాడు. నువ్వు సంపాదించాలి అంటే ముందు అడుక్కు తినాలి అని సమాధానం చెప్తాడు. అదేంటి స్వామి ఎలా అన్నారు. నేను అడుగుతున్నాను ఏంటి అని అడుగుతాడు మనోజ్.. నీ సమస్యకు పరిష్కారం ఇదే నువ్వు కొద్ది రోజులు అడుక్కుని తింటే ఆ తర్వాత నువ్వు అనుకున్న కల నెరవేరుతుంది అని సలహా ఇస్తాడు.
ఇక మనోజ్ నే తన ఫ్రెండు స్వామీజీ చెప్పినట్టు చేస్తే అంత నీకు మంచి జరుగుతుంది అని గుడి దగ్గర తీసుకొని వెళ్తాడు. అక్కడ అడుక్కునే వాళ్ళని చూపించి ఇక్కడే కూర్చుని అడుక్కోవాలి అని అంటారు. మనోజ్ ని ముష్టోడిలాగా మార్చేస్తాడు. మొత్తానికి మనోజ్ తన తెలివితేటలతో గుడి దగ్గర అడుక్కునేందుకు చోటు సంపాదించుకుంటాడు. అడుక్కుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మీనా గుడికి వస్తుంది.. అక్కడ మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ అని మనోజ్ ను అడుగుతుంది.
అందులో ఒక వ్యక్తి గొంతు మాత్రం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది అని మీనా అనుకుంటుంది. నీ మొహం చూపించు అని మొహం మీద ఉన్న గుడ్డని లాగేస్తుంది. అక్కడ మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు అని మనోజ్ ఏమీ తెలియనట్లు అడుగుతాడు.. ఈ విషయాన్ని వెంటనే బాలుకు చెప్పాలని మీద అనుకుంటుంది.. బాలు కు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రావాలి అని అడుగుతుంది. మీ అన్నయ్య ఇక్కడ ముష్టి వాళ్ళతో అడుక్కుంటున్నాడండి అని అంటుంది. బాలు మొదలు నమ్మలేకపోయిన మీనా చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని వస్తానని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. మనోజ్ గురించి బాలు తెలుసుకుంటాడా? ఇంట్లో ఎంత పెద్ద రచ్చ చేస్తాడో చూడాలి..