UAE Driving License: సాధారణంగా విదేశీ టూర్ కు వెళ్లినప్పుడు ఆయా దేశాల్లో వాహనాలను డ్రైవ్ చేసేందుకు అనుగుణంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ దేశానికి వచ్చే టూరిస్టులకు క్రేజీ న్యయూస్ చెప్పింది. 52 దేశాల పౌరులు సందర్శనకు వచ్చినప్పుడు వారు తమ సొంత దేశం లైసెన్స్ లను ఉపయోగించి యూఏఈలో డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ దేశాలకు చెందిన పర్యాటకులు తమ డ్రైవింగ్ లైసెన్స్ ను చూపించి యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ లైసెన్స్ కోసం మళ్లీ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు
యూఏఈ ప్రభుత్వం తమ పరిపాలనా విధానాలను సరళీకృతం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో ఈ నిర్ణయాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని భావిస్తోంది. అందులో భాగంగానే విదేశీ డ్రైవింగ్ లైసెన్స్ లతో తమ దేశంలో వాహనాలను నడిపే అవకాశం కల్పిస్తోంది. యూఏఈ సర్కారు గుర్తించిన 52 దేశాల నుండి వచ్చిన పర్యాటకులు తమ జాతీయ లైసెన్స్‌లను ఉపయోగించి UAEలో డ్రైవ్ చేయవచ్చు. పర్యాటకులు తమ దేశంలో ఉన్నంత వరకు, వాళ్లు నడిపే వాహనానికి అవసరమైన డాక్యుమెంట్స్ కలిగి ఉన్నంత వరకు డ్రైవింగ్ కొనసాగించవచ్చు. తాత్కాలిక అనుమతులు, ఇరత పరీక్షలు అవసరం లేదు. ఈ ప్రత్యేక హక్కు దక్షిణ కొరియా సందర్శకులకు వర్తించదని యూఏఈ తెలిపింది. వారు యూఏఈ నివాసాన్ని పొందిన తర్వాత మాత్రమే లైసెన్స్ మార్పిడికి అర్హులు అవుతారని వెల్లడించింది.
యూఏఈలో డ్రైవింగ్ చేయడానికి ఈ అర్హతలు అసవరం
⦿ కనీస డ్రైవింగ్ వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలి.
⦿ వైద్య (దృష్టి) పరీక్షలో పాస్ కావాలి.
⦿ వారి స్వదేశీ లైసెన్స్ కాపీని అందించాలి
కొన్ని సందర్భాల్లో, దరఖాస్తుదారులు యూఏఈ, వారి స్వదేశం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా వారి అసలు లైసెన్స్ లను అప్పగించాల్సి రావచ్చు. దరఖాస్తు ప్రక్రియ డిజిటల్ మురూర్ ఖౌస్ ప్లాట్ ఫామ్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి AED 600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూఏఈ లైసెన్స్ ను ఎలక్ట్రానిక్ గా లేదంటే కొరియర్ ద్వారా డెలివరీ చేయబడుతుంది.
Read Also: జనరల్ టికెట్ తో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ కచ్చితంగా తెలియాల్సిందే!
యూఏఈ గుర్తించిన దేశాలు ఏవంటే?
52 దేశాల పౌరుతు తమ సొంత దేశ డ్రైవింగ్ లైసెన్సులతో యూఏఈలో డ్రైవింగ్ చెయ్యొచ్చని తెలిపింది. యూఏఈ గుర్తించిన ఆ 52 దేశాల్లో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, హంగేరీ, నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, ఆస్ట్రియా, యూరప్, మధ్య ఆసియా, ఓషియానియాలోని ఇతర దేశాలు ఉన్నాయి. నిర్దిష్ట రాష్ట్ర స్థాయి ఒప్పందాల కారణంగా టెక్సాస్ కూడా ప్రత్యేక ఎంట్రీగా లిస్టులో చేర్చబడింది.
Read Also: విశాఖకు మెట్రో రైల్ వస్తే ఇలా ఉంటుంది.. ఈ వీడియో చూస్తే వావ్ అంటారు!