E-Paper
Advertisement

జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!

జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!
Advertisement

IRCTC Japan Ex-Delhi Tour Package 2026: విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో క్రేజీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘జపాన్ ఎక్స్ ఢిల్లీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా జపాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభించనుంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత జపాన్ బుల్లెట్ రైలులో ప్రయాణించే అవకాశం కూడా కల్పించనున్నట్లు IRCTC ప్రకటించింది.

టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ టూర్ 2026 సెప్టెంబర్ 6న ఢిల్లీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 15న ముగుస్తుంది. మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో జపాన్‌ లోని పలు పాపులర్ నగరాలను సందర్శించవచ్చు. ప్రయాణికులు ఢిల్లీ నుంచి ఆల్ నిప్పన్ ఎయిర్‌ వేస్ విమానంలో టోక్యోకు చేరుకుంటారు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభమవుతుంది.

టూర్ ప్యాకేజీ ధర ఎంత?

Advertisement

ఈ ప్యాకేజీ ధర ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణించే వారికి ఒక్కొక్కరికి రూ.3,49,999గా నిర్ణయించారు. ఒకవేళ ఎవరైనా ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే, వారికి రూ.4,73,999 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీ ధరతో పాటు ప్రభుత్వం విధించిన 2 శాతం టీసీఎస్ కూడా అదనంగా చెల్లించాలి.

ఏయే ప్రాంతాలు సందర్శించవచ్చు?

ఈ ప్రత్యేక టూర్‌లో జపాన్‌లోని పలు అందమైన నగరాలను చూడవచ్చు. వాటిలో టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా ప్రాంతాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మౌంట్ ఫూజీ పర్వతాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే క్యోటోలోని అందమైన వెదురు అడవి, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒసాకా కోట, అలాగే హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ లాంటి ప్రముఖ ప్రాంతాలను కూడా పర్యాటకులు సందర్శించవచ్చు.

బుల్లెట్ రైలు ప్రయాణం ప్రత్యేక ఆకర్షణ

Advertisement

ఈ టూర్‌లో ప్రధాన ఆకర్షణ జపాన్‌కు ప్రసిద్ధి చెందిన షింకాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించడం. పర్యాటకులు షిన్ ఒసాకా నుంచి హిరోషిమా వరకు, అలాగే హిరోషిమా నుంచి టోక్యో వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించనున్నారు.  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు వ్యవస్థల్లో ఒకటైన జపాన్ బుల్లెట్ రైలు అనుభవాన్ని ఈ టూర్ మరింత ప్రత్యేకంగా మార్చనుంది.

అందుబాటులో ఇండియన్ ఫుడ్  

విదేశాలకు వెళ్లే భారతీయులు ఎక్కువగా ఆహారం విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని IRCTC ఈ టూర్‌ లో ప్రత్యేకంగా భారతీయ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది. దీంతో ఆహారం విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఏ డాక్యుమెంట్స్ కావాలంటే?

ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారి దగ్గర పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐటీఆర్ రికార్డులు లాంటి  పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. జపాన్ వీసా ప్రక్రియ కోసం ఈ డాక్యుమెంట్లను IRCTCకి సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనతో పాటు జపాన్ సంస్కృతి, ప్రకృతి అందాలు, ఆధునిక సాంకేతికతను చూసే అవకాశం కోరుకునే వారికి ఈ IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హైదరాబాద్ నుంచి క్రేజీ గోవా ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ మీకోసమే!

Related News

జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!

వరదలతో ట్రైన్ క్యాన్సిల్.. రీఫండ్ ఇవ్వని రైల్వేకు భారీ షాక్!

కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!

తత్కాల్ మిస్ అయ్యిందా? చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సీక్రెట్ ట్రిక్ ఇదే!

దేశంలో ఫాస్టెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. సికింద్రాబాద్– విశాఖ ఎక్స్ ప్రెస్ స్పీడ్ ఎంతో తెలుసా?

రైలులో టీ తాగుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి.. ఈ వీడియో చూడండి బ్రో, మీకే తెలుస్తుంది?

ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

టైటానిక్ మునిగిపోతుందని 14 ఏళ్ల ముందే తెలుసా? ఆ నవలలో ఉన్నట్టే అక్షరాలా జరిగిందా?

Big Stories

Advertisement
×