E-Paper
Advertisement

రైలులో టీ తాగుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి.. ఈ వీడియో చూడండి బ్రో, మీకే తెలుస్తుంది?

రైలులో టీ తాగుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి.. ఈ వీడియో చూడండి బ్రో, మీకే తెలుస్తుంది?
Advertisement

Train Tea: ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద నెట్ వర్క్ ఇండియన్ రైల్వే. ప్రతీ రోజూ కోట్లలో ట్రావెల్ చేస్తున్నారు ప్రయాణికులు. రైలులో వడ్డించే ఆహారం-టీ గురించి చెప్పనక్కర్లేదు. డబ్బులు తీసుకున్నా క్వాలిటీ ఉండదని పదే పదే ప్రయాణికులు చెబుతుంటారు. తాజాగా రైళ్లలో తయారు చేసే టీ గురించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతోంది.

 

రైలులో టీ తాగుతున్నారా?

Advertisement

ఏదో విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఇండియన్ రైల్వే. ఎందుకంటే ప్రతీరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కానీ సర్వీసుల విషయంలో అభాసుపాలవుతుంది. 2023 డేటా మేరకు భారతీయ రైల్వేలో దాదాపు 14 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. లక్షల్లో పని చేస్తున్న ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర తప్పులు దొర్లుతుంటాయి. ఉద్యోగుల మాట కాసేపు పక్కనపెడదాం.

కనీసం రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో విమర్శల పాలవుతుంది. రైల్వే వ్యవస్థ గురించి తెలిసినవాళ్లు అందులో ఆహారం, టీ-కాఫీలు తాగేందుకు ఏమాత్రం ఇష్టపడరు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతోంది.

ఈ వీడియో చూడండి బ్రో

Advertisement

తాజాగా సోషల్ మీడియాలో ఓ రైల్వే ట్రావెలర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రైళ్లలో టీ-కాఫీలు ఇంత దారుణంగా ఉంటాయా? అంటూ షాకవుతున్నారు. కనిపిస్తున్న వీడియో ఆ విషయాన్ని రుజువు చేసింది.
ఇళ్లలో నీళ్లు కాచుకునేందుకు వాటర్ హీటర్ ఉపయోగిస్తాము. అదే విధంగా క్యాటరింగ్ ఉద్యోగి ఆ విధంగా టీ రెడీ చేస్తున్నాడు.

రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చేందుకు తీసుకొచ్చిన క్యాన్లో నేరుగా వాటర్ హీటర్‌తో టీ ని వేడి చేస్తున్నాడు. ఈ దృశ్యాలు చూసి టీ తాగే వారు షాకయ్యారు. రైళ్లలో ఏమీ తాగవద్దు.. తినవద్దు అని చెబుతున్నా, తాము నమ్మలేదని అంటున్నారు. రియల్‌గా చూసిన తర్వాత ఇలాంటి చాయ్ తాగామా? అంటూ షాకవుతున్నారు.

ALSO READ: ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లాభాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రయాణికుల సేవల విషయంలో విమర్శల పాలవుతూనే ఉంటుంది. ఈ వీడియోను  ఐఆర్సీటీసీతోపాటు రైల్వేమంత్రిని ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

 

 

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×