E-Paper
Advertisement

తత్కాల్ మిస్ అయ్యిందా? చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సీక్రెట్ ట్రిక్ ఇదే!

తత్కాల్ మిస్ అయ్యిందా? చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సీక్రెట్ ట్రిక్ ఇదే!
Advertisement

IRCTC Chart Vacant Feature: ముందుగా రైలు టికెట్ బుక్ చేయడం మరిచిపోయారా? తత్కాల్ టికెట్ దొరకలేదా? అలాంటి సమయంలో ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర సదుపాయాన్ని IRCTC అందిస్తోంది. అదే ‘Charts Vacant’ ఫీచర్. దీని ద్వారా రిజర్వేషన్ చార్ట్ రెడీ అయిత తర్వాత కూడా ఖాళీగా ఉన్న కన్ఫర్మ్ సీట్లను ఆన్‌ లైన్‌ లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ పొందే అవకాశం   

సాధారణంగా రిజర్వేషన్ చార్ట్ విడుదలైన తర్వాత టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదని చాలామంది భావిస్తారు. కానీ, అందులో నిజం లేదు. రైలులో ఇంకా ఖాళీగా ఉన్న సీట్లు ఉంటే, వాటిని కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేసే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. IRCTC వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌లో ‘Charts Vacant’ అనే స్పెషల్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఏ రైలులో ఏ కోచ్‌ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో నేరుగా తెలుసుకోవచ్చు. స్టేషన్‌ కు వెళ్లి విచారించాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే సీట్ల అవైలబులిటీ చూసి వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్ ఎలా చేసుకోవాలంటే?

Advertisement

ఈ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, సాధారణంగా రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ సిద్ధమవుతుంది. చార్ట్ విడుదలైన తర్వాత నుంచి రైలు బయలుదేరే సమయానికి సుమారు ఐదు నిమిషాల ముందు వరకు ఖాళీ సీట్లు ఉంటే వాటిని కరెంట్ బుకింగ్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని రైళ్లలో చార్ట్ సిద్ధమయ్యే సమయం మారే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తత్కాల్ టికెట్‌ల మాదిరిగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ టికెట్ ధరతోనే కన్ఫర్మ్ సీటు బుక్ చేసుకోవచ్చు. కొన్ని సెలెక్ట్ చేసిన రైళ్లలో ఇండియన్ రైల్వేస్ 10 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గింపును కూడా ఇవ్వొచ్చు.

టికెట్ క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్!

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. కరెంట్ బుకింగ్ ద్వారా తీసుకున్న టికెట్‌ను తర్వాత క్యాన్సిల్ చేస్తే చాలా సందర్భాల్లో రీఫండ్ లభించదు. అందుకే ప్రయాణం ఖరారైన తర్వాతే ఈ టికెట్‌ను బుక్ చేయడం మంచిది. ఈ విధానంలో వెయిటింగ్ లిస్ట్, RAC ఉండదు. సీటు అందుబాటులో ఉంటే నేరుగా కన్ఫర్మ్ టికెట్ లభిస్తుంది.  అందుకే చివరి నిమిషంలో కూడా ఖచ్చితమైన సీటు కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఖాళీ సీట్లు ఎలా చూడాలంటే?

Advertisement

IRCTCలో ఖాళీ సీట్లను సింపుల్ గా చూడవచ్చు. ముందుగా IRCTC యాప్, వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి Train విభాగంలోకి వెళ్లాలి. అక్కడ Charts Vacant అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత రైలు నంబర్, ప్రయాణ తేదీ ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న కోచ్‌లు, సీట్లు వెంటనే కనిపిస్తాయి. మీకు నచ్చిన సీటును వెంటనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

Read Also: దేశంలో ఫాస్టెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. సికింద్రాబాద్– విశాఖ ఎక్స్ ప్రెస్ స్పీడ్ ఎంతో తెలుసా?

Tags

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×