IRCTC Panch Jyotirlinga Darshan : పంచ జ్యోతిర్లింగాల దర్శనానికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ద్వారా ఈ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. టూరిస్టుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం
ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పంచ జ్యోతిర్లింగాల యాత్ర మొదలవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రికులతో బయల్దేరుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు పంచ జ్యోతిర్లింగ దర్శనం టూర్ కొనసాగుతుందని IRCTC ప్రకటించింది. ఈ యాత్ర మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ (నాగ్‌పూర్-ఉజ్జయిని), త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ (నాసిక్), భీమశంకర్ జ్యోతిర్లింగ (పూణే), గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ (ఔరంగాబాద్)లను కవర్ చేస్తుంది.
ఈ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ భారత్ గౌరవ్ రైలు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణతో సహా ఈ మార్గంలోని కీలక స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టూర్ ప్యాకేజీలో రైలు, రోడ్డు రవాణా రెండింటినీ కవర్ చేసే పూర్తి ప్రయాణ ఏర్పాట్లు, అలాగే వసతి, క్యాటరింగ్ సేవలు ఉన్నాయి, రైలులో, బయట బ్రేక్ ఫాస్ట్, భోజనం, రాత్రి భోజనం అందించబడతాయి. రైలులో భద్రత (CCTV కెమెరాలు), అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, సహాయం కోసం ప్రయాణమంతా టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు.
ప్యాకేజీ టికెట్ కాస్ట్ ఎంత అంటే?
స్లీపర్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.14,700గా ఉంటుంది. 5-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ.13,700గా నిర్ణయించారు. 3AC ఛార్జీ 22,900గా ఉంటుంది. పిల్లలకు రూ. 21,700గా నిర్ణయించారు. 2AC ఛార్జీ రూ.29,900గా ఈఉంటుంది. పిల్లలకు రూ. 28,400గా నిర్ణయించారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి ఆ రైల్లో వెళ్తున్నారా? అయితే, ఈ విషయం తెలియాల్సిందే!
ఈ యాత్రకు వెళ్లాలి అనుకునే టూరిస్టులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. బుకింగ్‌ల కోసం, 9701360701/ 9281030740/ 9281030750/ 9281030711 నంబర్‌లను సంప్రదించవచ్చన్నారు. లేదంటే www.irctctourism.com ని సందర్శించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!