Hyperloop Trains In India: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ రైల్వే వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇండియర్ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. సంప్రదాయ రైళ్లకు భిన్నంగా సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మేకిన్ ఇండియాలో భాగంగా వందేభారత్ రైళ్లను తయారు చేసి ఇండియన్ రైల్వే సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. అదే సమయంలో హైడ్రోజన్ రైలును కూడా తయారు చేస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంతగా వేగంగా ప్రయాణించే అత్యాధుని హైపర్ లూప్ రైలును కూడా తయారు చేస్తున్నారు. ఈ రైలు 2029 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 1100 నుంచి 1200 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.
ముంబై- పూణె నడుమ తొలి హైపర్ లూప్ రైలు పరుగులు
ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే హైపర్ లూప్ రైలు తొలుత ముంబై- పూణె నగరాల నడుమ పరుగులు తీయనుంది. ఈ రైలు కేవలం 25 నిమిషాల వ్యవధిలో రెండు నగరాలను కలపనుంది. ఈ హై స్పీడ్ ఇంటర్-సిటీ ట్రాన్స్ పోర్ట్ మోడ్ 2029 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రైలు ద్వారా ప్రజలు వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోనున్నారు. నెక్ట్స్ జెనరేషన్ మాస్ మొబిలిటీగా హైపర్ లూప్ రైలు రూపొందుతోంది.
2029 నాటికి అందుబాటులోకి!
ఈ హైపర్ లూప్ రైలుకు సంబంధించి సాంకేతికతను పూణెకు చెందిన క్వింట్రాన్స్ సంస్థ డెవలప్ చేస్తోంది. “మేము ఒక నావెల్ పేటెంట్ పెండింగ్ కాంక్రీట్ ట్యూబ్ ను ప్రోటో టైప్ చేశాం. హైపర్ లూప్ కోసం లీనియర్ మోటర్ రూపొందించాం. ఇందులో టన్ను పేలోడ్ పైకి కదలగల సామర్థ్యం ఉంటుంది. దేశంలోని తొలి కస్టమ్ ట్రాక్ ఆధారిత లీనియర్ మోటార్ కంట్రోలర్ లో ఒక దానిని డెవలప్ చేస్తున్నాం. టన్ను కంటే ఎక్కువ పేలోడ్ సామర్థ్యంతో మాగ్నెటిక్ లెవిటేషన్ మాడ్యూల్స్ ను అభివృద్ధి చేయడం మా నెక్ట్స్ టార్గెట్. 2029 నాటికి తొలి కమర్షియల్ ట్రాక్ కార్గోతో రెడీ అవుతుంది. ప్యాసింజర్ మోడ్‌కు కొంచెం ఎక్కువ టైమ్ పట్టే అవకాశం ఉంది” అని క్విన్‌ట్రాన్స్ సీఈఓ ప్రణయ్ లునియా తెలిపారు.
హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ నిర్మిస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థులు
అటు అత్యాధునిక హైపర్ లూప్ ట్రైన్ కు సంబంధించి IIT మద్రాస్ విద్యార్థులు 410 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను రూపొందించారు. IIT మద్రాస్ కు చెందిన 76 అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ట్రాక్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో టెక్నాలజీని పరిశీలించనున్నారు. ఇందుకోసం 11.5 కిలోమీటర్ల ట్రాక్ ను నిర్మించనున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత, మిగిలిన 100 కిలోమీటర్ల మార్గాన్ని కవర్ చేయడానికి రెండవ దశను ప్రారంభిస్తారు.
Watch: Bharat’s first Hyperloop test track (410 meters) completed.
👍 Team Railways, IIT-Madras’ Avishkar Hyperloop team and TuTr (incubated startup)
📍At IIT-M discovery campus, Thaiyur pic.twitter.com/jjMxkTdvAd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 5, 2024
హైపర్ లూప్ ధరలు ఎంత ఉండొచ్చంటే?
ముంబై- పుణె నడుమ హైపర్ లూప్ ట్రైన్ టికెట్ ధరలు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటాయనే ప్రచారం జరుగుతున్నది. “ప్రస్తుతం పుణె-ముంబైకి నేరుగా వెళ్లే విమానానికి రూ.3,000 ఖర్చవుతుంది. వందే భారత్ రైలులో రూ. 750 ధర ఉంది. హైపర్ లూప్ ఈ రెండింటి కంటే ఉత్తమమైనది. కేవలం 25 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది” అని క్విన్‌ట్రాన్స్ సీఈఓ ప్రణయ్ లునియా వెల్లడించారు.
Read Also: బయో వాక్యూమ్ టాయిలెట్లు, హాట్ వాటర్ షవర్లు.. అదిరిపోయే ఫీచర్లతో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్!