BigTV English
Advertisement

Con Woman Marry 6 Men: 6 మంది పురుషులను వివాహం చేసుకున్న యువతి.. ఏడోసారి పెళ్లికి కూడా రెడీ.. కానీ

Con Woman Marry 6 Men: 6 మంది పురుషులను వివాహం చేసుకున్న యువతి.. ఏడోసారి పెళ్లికి కూడా రెడీ.. కానీ

Con Woman Marry 6 Men| దేశంలో దొంగ పెళ్లి కూతర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీన్ని క్రిమినల్స్ ఒక దందా లాగా మర్చేశారు. పెళ్లి కాని ప్రసాదులను వేటాడడమే వీరి పని. తాజాగా పోలీసులు ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక యువతి ఏకంగా ఆరు మంది పురుషులను వివాహం చేసుకొని మోసం చేసింది. ఏడో సారి కూడా కూడా అలాగే చేసేందుకు ప్రయత్నించి పట్టుబడింది. ఈ ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు మోసగాళ్లు కూడా ఉన్నారు. వారిదంతా ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ సభ్యులు పెళ్లి తరువాత బంగారం, నగదు దొంగలించి ఇంటి నుంచి పరారవుతారు. ఈ గ్యాంగ్ మొత్తన్నిఇటీవలే పోలీసులు పట్టకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బండా నగరంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. పూనమ్ (26) అనే యువతి, సంజనా గుప్తా (41)తో కలిసి తామిద్దరం తల్లీ కూతుళ్లమని యువకులను మోసం చేసేవారు. వీరి గ్యాంగ్ లో విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి అనే మరో ఇద్దరు కూడా ఉన్నారు. ముందుగా విమలేశ్, ధర్మేంద్ర ఇద్దరూ కలిసి ఒక పెళ్లి కాని యువకుడిని వెతుకుతారు. ఆ యువకుడు ధనవంతుడై ఉండాలి లేదా కనీసం మధ్య తరగతికి చెందిన వాడై ఉండాలి. ఆ తరువాత విమలేశ్ ఆ పెళ్లి కాని యువకుడితో తాను పెళ్లి సంబంధాలు చూస్తానని సంప్రదిస్తాడు. ఆ యువకుడి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వారికి పూనమ్ ఫోటోలు చూపిస్తాడు.

ఆ తరువాత పూనమ్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ పూనమ్, సంజనాలను తల్లికూతుళ్లుగా పరిచయం చేస్తాడు. పక్కనే ధర్మేంద్ర ఒకసారి పూనంకు మేనమామగా, తండ్రిగా, బంధువుగా పరిచయమవుతాడు. పూనం అందంగా ఉండడంతో పెళ్లికోసం యువకుడు త్వరగానే అంగీకరిస్తారు. అంతా నిజంగా జరుగుతున్నట్లు నమ్మించేందుకు విమలేశ్ పెళ్లి కుదిర్చినందుకు కమీషన్ అడుగుతాడు. ఆ తరువాత పూనం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పి.. సింపుల్ గా కోర్టులో పెళ్లి చేసుకుంటారు.


Also Read: 40 ఏళ్లుగా ఒకే భర్త నుంచి 12 సార్లు విడాకులు తీసుకున్న మహిళ.. తలలు పట్టుకున్న అధికారులు!

పెళ్లి జరిగిన తరువాత పూనం తన కొత్త వరుడి ఇంటికి వెళ్లి అక్కడ బంగారం, డబ్బులు ఎక్కడ ఉందో వెతుకుతుంది. ఈ సమాచారమంతా తన గ్యాంగ్ సభ్యులకు చేరవేస్తుంది. ఆ తరువాత అదును చూసి డబ్బంతా దొంగిలించేసి ఆమె తన గ్యాంగ్ తో సహా ఉడాయిస్తుంది. పూనం కోసం ఆ పెళ్లికొడుకు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళితే.. అది అద్దె ఇల్లు అని తెలుస్తుంది. ఇదీ ఈ గ్యాంగ్ మోసం చేసే ప్రక్రియ. ఇలా మొత్తం ఆరుగురు యువకులను పూనం గ్యాంగ్ మోసం చేసింది. కానీ ఏడోసారి వీరికి అదృష్టం కలిసిరాలేదు. ఎందకంటే ఈసారి వారికి శంకర్ ఉపాధ్యాయ్ అనే తెలివైన యువకుడు పరిచయమయ్యాడు.

ముందుగా శంకర్ ఉపధ్యాయ్ వద్దకు కొన్ని రోజుల క్రితం విమలేశ్ వచ్చి పెళ్లికూతురు ఫొటో చూడమని పూనం ఫొటోని చూపించాడు. ఆ తరువాత పెళ్లి జరగాలంటే తనకు ముందుగా రూ.1.5 లక్ష చెల్లించాలని డిమాండ్ చేశాడు. అందుకు శంకర్ అంగీకరించాడు. ఆ తరువాత కోర్టులో పెళ్లి కోసం పూనం తన తల్లి సంజనా, బంధువు ధర్మేంద్ర తో వచ్చింది. కానీ కోర్టులో పూనం, ఆమె తల్లి ఆధార్ కార్డులు చూసి శంకర్ కు అనుమానం కలిగింది. అవి నకిలీ ఆధార్ కార్డులని శంకర్ కు ఎందుకో అనిపించింది. పైగా వెంటనే రూ.1.5 లక్ష ఇవ్వమని విమలేశ్ వచ్చాడు.

Also Read: రూ.20 కే పెళ్లికూతురు.. ఆ ఊరెళితే తక్కువ ధరకే పిల్లనిస్తారు!

కానీ శంకర్ పెళ్లికి నిరాకరించాడు. తనకు అనుమానంగా ఉందని.. అంత డబ్బు ఇవ్వనని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోయాడు. అప్పుడే వారంతా కలిసి శంకర్ ను కొట్టారు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని, అతని వేధింపుల కేసు పెడతామని బెదిరించారు. కానీ శంకర్ చాకచక్యంగా ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని అక్కడి నుంచి పారిపోయి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. వారికి జరిగినదంతా చెప్పి.. పూనమ్ గ్యాంగ్ ని పోలీసులకు పట్టించాడు.

Related News

Crime in Flight: విమానంలో మెటల్ ఫోర్క్‌తో ఇద్దరిని పొడిచాడు.. సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటకీ..?

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Acid Attack Case New Twist: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు, బాధితురాలి తండ్రి అరెస్ట్

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?

Big Stories

×