Indian Railways: ఇండియన్ రైల్వేలో ఇంతకుముందు సీనియర్ సిటిజన్లకు టికెట్లపై రాయితీ ఉండేది. కానీ 2020లో కరోనా విజృంభించిన సమయంలో అన్ని రాయితీలను ఎత్తివేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా, దీన్ని మరోసారి అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ అధికారిక సమాచారం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ప్రకటించినట్లు ఒక్కటే పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది మనం ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం..
ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..
రైల్వే సీనియర్ సిటిజన్లకు రాయితీపై ఇండియన్ రైల్వే శాఖ స్పందించింది. ఓ క్లారిటీని ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు రాయితీని ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న న్యూస్ అంతా ఫేక్ అని ఖండించింది. భారతీయ రైల్వే వృద్ధులకు రైలు టిక్కెటుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి రైల్వే శాఖ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని వివరించింది.
ALSO READ: Group-D Jobs: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్..
2020 మార్చిలో కరోనా విలయ తాండవం సృష్టించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మోదీ సర్కార్ లాక్ డౌన్ కూడా ప్రకటించింది. అదే సమయంలో రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ఇంతవరకు సీనియర్ సిటిజన్లకు రాయితీ అమలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఎప్పుడూ ప్రకటించలేదు. దీంతో తమ విధానాల్లో ఎలాంటి మార్పులేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లు, ప్రయాణికులు కచ్చితమైన సమాచారం కోసం ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్, మీడియా ఛానెల్ ల నుంచి అధికారిక సమాచారంపై నమ్మాలని సూచించింది. సోషల్ మీడియాలో దర్శనమిచ్చే పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!
2020 మార్చి నెలలో లాక్ డౌన్ సమయంలోనే రైల్వే శాఖ రాయితీలను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో కరోనా కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, బోగీల్లో మార్పులు చేర్పులు, ఎక్స్ ప్రెస్, పాసింజర్ ట్రైన్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి. దీంతో సీనియర్ సిటిజన్లతో పాటు స్టూడెంట్స్ కు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాదని రైల్వే శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వేశాఖ తిరిగి ఇప్పటివరకూ మళ్లీ అమలు చేయలేకపోయింది. కానీ గతంలో రాయితీలు పొందిన సీనియర్ సిటిజన్లు మళ్లీ టికెట్ పై డిస్కౌంట్ ప్రకటిస్తారో అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.