Neel – NTR:నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. దివంగత నటులు సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. తాతకు తగ్గ మనవడు అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇకపోతే గత మూడేళ్ల క్రితం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి తన నటనతో ప్రపంచ స్థాయి ఆడియన్స్ ను మెప్పించిన ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదట ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. సైలెంట్గా రూ. 600 కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. అంతేకాదు రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ డ్రాగన్(Dragon). ‘కే జి ఎఫ్ 1,2’ చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ డ్రాగన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
హైదరాబాదులో రేపే డ్రాగన్ షూటింగ్ ప్రారంభం.. కానీ..
ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండీ అప్డేట్ వదులుతారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఇప్పటివరకు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి కనీసం ఒక్క అప్డేట్ అయినా వదులుతారా? ఎప్పుడు, ఎక్కడ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది? అని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అభిమానుల ఎదురీతకు తెర దింపుతూ.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అభిమానులను సంతోషపరుస్తోంది. రేపు హైదరాబాద్లోనే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. షూటింగ్ కోసం భారీ సెట్ కూడా నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దాదాపు పది రోజులపాటు కొనసాగుతుంది అని ,కానీ ఈ మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనడం అని సమాచారం. ఇకపోతే రేపు ప్రారంభం కాబోయే ఈ షూటింగ్లో దాదాపు 1500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
సస్పెన్స్ వీడని నటీనటుల జాబితా..
ఇకపోతే సాధారణంగా ఒక సినిమా అనౌన్స్మెంట్ తర్వాత అందులో నటించే నటీనటుల పేర్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎవరెవరు ఏ ఏ క్యారెక్టర్లలో భాగం కాబోతున్నారు అనే విషయంపై కూడా అభిమానులు ఆరాతీస్తున్నారు. ఇకపోతే కన్నడ అమ్మాయి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పనిచేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతోంది. పైగా పూర్తిగా హైదరాబాదులోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం . ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ‘వార్ -2’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విరామం తీసుకుంటున్నాడు. మార్చి నుంచి డ్రాగన్ సెట్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు మంచి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అని చెప్పవచ్చు.