Kamakhya Express Derail: ఒడిశాలోని కటక్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. నర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ట్రైన్‌లోని 11 బోగీలు పట్టాల నుంచి పక్కకు పడినట్టు సమాచారం. పండగపూట కావడంతో ట్రైన్‌లో తక్కువ మంది ఉండడంతో.. పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా.. మరొకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్,అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
యాక్టిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ ట్రైన్‌ను ప్రమాద స్థాలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏంటనేది తెలియరాలేదు.. ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు కటక్(8991124238) భువనేశ్వర్(8455885999) పలాస (9237105480) అందుబాటులోకి తెచ్చారు. కామాఖ్య ఎక్కస్ ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లను వేరే మార్గానికి మళ్లించారు.
ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని.. వీలైనంత త్వరగా రైళ్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని ఈస్ట్‌కోస్ట్ రైల్వే చీఫ్ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
Also Read: PNR నెంబర్ తో ఇన్ని లాభాలున్నాయా? అసలు ఇంతకీ PNR నెంబర్ అంటే ఏంటి?
ఇదిలా ఉంటే ఇటీవల వరుస ట్రైన్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు తప్పడం, ట్రైన్ లో మంటలు చెలరేగడం వంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం.. గత కొంత కాలంగా రైలు పట్టాలపై కొందరు దుండగులు ఇనుము, గ్యాస్ సిలండర్, సిమెంట్ దిమ్మెలను పెడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. దీంతో ఈ ప్రమాదంపై అలాంటి కుట్ర కోణం ఎమైనా ఉందా? లేక టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝి మాట్లాడుతూ.. ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే శాఖ అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం పట్ల తీవ్ర ఆందోళన చెందాను. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నరని తెలిసి ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి ఉన్నాయని తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.