Allu Arjun -Atlee:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్ప2 (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం తెచ్చుకొని, ఇప్పుడు భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాతో వస్తాడు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు త్రివిక్రమ్ (Trivikram ).దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. కానీ ఈ సినిమా సెట్ పైకి రావడానికి ఇంకా సమయం పడుతుండడంతో.. ఈ లోపు అల్లు అర్జున్.. అట్లీ(Atlee) తో సినిమా చేయబోతున్నారని సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అట్లీ కూడా తెలుగులో సినిమాలు చేసి, తన మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ పాన్ ఇండియా మూవీ రాబోతున్నట్లు సమాచారం.
అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్..
ఇక అందులో భాగంగానే అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ తో కలిసి దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్ కూడా చేశారు. ఇక త్వరలోనే అధికారికంగా సినిమాను ప్రకటించి, సమ్మర్ హాలిడేస్ తర్వాత షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. ఇకపోతే ఇలాంటి సమయంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Kantara 2: కాంతారా ఫ్రాంచైజీలోకి స్టార్ హీరో.. ఎవరంటే?
అట్లీ – అల్లు అర్జున్ మూవీలో అల్లు శిరీష్..
అసలు విషయంలోకి వెళితే.. సరైన సక్సెస్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ సోదరుడు ప్రముఖ హీరో అల్లు శిరీష్ (Allu Sirish)ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. ఇటీవల అల్లు శిరీష్ కూడా దుబాయ్ వెళ్లి వచ్చారు. అటు అట్లీ – అల్లు అర్జున్ కూడా స్టోరీ సిట్టింగ్స్ వేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరితో కలిసి అల్లు శిరీష్ కూడా తన పాత్ర గురించి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో అల్లు శిరీష్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడని, ఒకవేళ ఇదే నిజమైతే అన్నదమ్ములు కలిసి కనిపిస్తే చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్న అల్లు అభిమానులకు ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పవచ్చు . అసలే సక్సెస్ కోసం ఆరాటపడుతున్న అల్లు శిరీష్ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక చివరిగా బడ్డీ అనే సినిమాతో పలకరించినా.. అది కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఇక కొన్ని రోజులు కనిపించకపోతే కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని సినీవర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తన అన్నయ్య సినిమాతో నైనా తనకు గుర్తింపు రావాలని శిరీష్ బలంగా కోరుకుంటున్నారట. మరి శిరీష్ కి నిజంగానే ఈ సినిమాలో అవకాశం కల్పిస్తున్నారా? ఒకవేళ కల్పిస్తే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.