జమ్మూకాశ్మీర్ కు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ లోనూ రైల్వే నెట్ వర్క్ ను శరవేగంగా విస్తరిస్తున్నది. అందులో భాగంగానే.. తాజాగా జమ్మూ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసింది. అటు ఉధంపూర్, శ్రీనగర్- బారాముల్లా రైల్వే లైన్ ను త్వరలో ప్రారంభించనుంది. ఈ రూట్ ద్వారా న్యూఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు వందేభారత్ స్లీపర్ రైలును నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
సరికొత్త వందేభారత్ ఆవిష్కరణ
త్వరలో కత్రా- శ్రీనగర్ రైల్వే మార్గంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జమ్మూ కాశ్మీర్ శీతాకాల పరిస్థితులను తట్టుకుని నడిచేలా రూపొందించిన ప్రత్యేక రైలును అధికారులు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ రైలు న్యూఢిల్లీలోని షకుర్‌బస్తీ కోచింగ్ డిపోలో ఉన్నది. మరోవైపు కత్రా-శ్రీనగర్ రైల్వే మార్గాన్ని ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే ఈ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రూట్లలో 136 వందేభారత్ రైళ్లు తమ సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఈ రైళ్లతో పోల్చితే జమ్మూకాశ్మీర్ లో నడిచే వందేభారత్ రైలు అనేక అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. జమ్మూకాశ్మీర్ లోనే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ప్రయాణించేలా రూపొందించారు. చల్లటి వాతావరణంలోనూ ప్యాసింజర్లు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. “ఇది వాటర్ ట్యాంక్, బయో-టాయిలెట్ ట్యాంక్ లను గడ్డకట్టకుండా నిరోధించే వ్యవస్థను కలిగి ఉంటుంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలోనూ సాఫీగా పని చేసేలా ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ను కలిగి ఉంది” అని రైల్వే బోర్డు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. “విండ్‌షీల్డ్ లో హీటింగ్ ఎలిమెంట్లను పొందుపర్చారు. దీని ద్వారా లోకో పైలెట్లకు శీతాకాల సమయంలోనూ ముందు భాగం స్పష్టంగా కనిపిస్తుంది” అని తెలిపారు.
Read Also:ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఆ రెండు వందేభారత్ రైళ్లలో సీటింగ్ కెపాసిటీ పెంపు!
జమ్మూకాశ్మీర్ లో నడిచే ఈ ప్రత్యేక వందేభారత్ రైల్లో ఇంకా పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు అందుబాటులో ఉన్నాయి. బయట గడ్డకట్టే చలి ఉన్నా, రైల్లో వెచ్చగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రైలు ప్రారంభంతో కాశ్మీర్ లోయకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరిగనుంది. అంతేకాదు, జమ్మాకాశ్మీర్ లో పర్యాటక అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది. అయితే, ఈ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనవరి 26న పలు జమ్మూకాశ్మీర్ కు సంబంధించి పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.
Read Also:2025లో ఎంట్రీ ఇవ్వబోతున్న హైస్పీడ్ లగ్జరీ రైళ్లు ఇవే.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!