Rithu Chowdary Case : ఏపీ 700 కోట్ల భూస్కాంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఏసీబీ కస్టడీలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అందులో పలువురు వైసీపీ ముఖ్య నేతల పేర్లు బయటకు రాగా, ఈ కేసులో కీలకంగా పేరు విన్పిస్తున్న రీతూ చౌదరి (Rithu Chowdary)ని అరెస్ట్ చేయబోతున్నారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏసీబీ విచారణలో సంచలన విషయాలు
సింగ్ ను తాజాగా ఈ 700 కోట్ల భూస్కాంలో ఏసీబీ ప్రశ్నిస్తుండగా, ఆయన చంద్రబాబుకు రాసిన లేఖకు కట్టుబడి ఉంటానని ఏసీబీ ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. తాను చేసిన ఆరోపణలు కు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పిస్తానని ఘంటాపథంగా చెప్పిన సింగ్, జగన్ సర్కారు హయాంలో జరిగిన అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు విప్పుతానని కస్టడీలో తెలిపినట్టు సమాచారం. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయాలని అప్పటి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయనీ, జగన్ పిఎ కెఎన్ఆర్ అన్నిటికీ సూత్రధారి అని ఆయన చెప్తున్నారు. ఇక కస్టడీలో విచారణ సందర్భంగా కేఎన్ఆర్ ఆస్తుల చిట్టాను కూడా విప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీకాంత్, రీతు చౌదరి (Rithu Chowdary)ల పేరున రిజిస్ట్రేషన్లు చేసిన అక్రమ ఆస్తుల వివరాలను సింగ్ బయట పెట్టినట్టు తెలుస్తోంది.
గోవా తీరంలో శ్రీకాంత్, రీతూ
సింగ్ తనను కిడ్నాప్ చేసి, గోవాకు తీసుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను అక్రమంగా జరిపారని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ విచారణలో ఆయన రీతూ చౌదరిని శ్రీకాంత్ గోవా తీరానికి తీసుకువచ్చే వాడని వెల్లడించినట్టు తెలుస్తోంది. అతను ఇచ్చిన వివరాలతో శ్రీకాంత్ చీమకుర్తి, రీతూ చౌదరి, కేఎన్ఆర్ ల చుట్టూ ఉచ్చు బిగుసుకోబోతోంది. సింగ్ విచారణ ముగిసిన అనంతరం శ్రీకాంత్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుబోతోందని సమాచారం. ఆ తర్వాత రీతూ చౌదరి (Rithu Chowdary)ని కూడా ఏసీబీ ప్రశ్నించనుంది.
రీతూ చౌదరి అరెస్ట్ ?
ఈరోజు సాయంత్రానికి సింగ్ విచారణ పూర్తి కానుండగా, రేపటిలోగా రీతూ చౌదరి (Rithu Chowdary), శ్రీకాంత్ లకు నోటీసులు పంపి, విచారణ నిమిత్తం పోలీసులు వారిని అదుపులోకి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. సింగ్ ను నిన్న మధ్యాహ్నం నుంచి ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆయన కస్టడీలో పెను సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. నాలుగు రోజుల పాటు విచారణ కొనసాగనుండగా, సింగ్ ను విచారించిన తర్వాత శ్రీకాంత్ ను, ఆ తర్వాత రీతూ చౌదరిని విచారణకు పిలిపించబోతున్నారు. వీళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా విచారణ పిలిచే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటిదాకా తనకసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చిన రీతూ చౌదరి, ఇప్పుడు విచారణలో ఏం చెప్పబోతుంది అన్నది కీలకంగా మారింది. శ్రీకాంత్ తో తన విడాకుల కేసు కోర్టులో ఉందని, అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటో కూడా తనకు తెలియదని, వాళ్ళు సైన్ చేయమన్న దగ్గర మాత్రం సంతకం చేశానని ఇప్పటికే ఆమె బిగ్ టీవికి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.