Shikhar Dhawan : సాధారణంగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ పేరు వినగానే డాషింగ్ బ్యాటింగ్, గబ్బర్ సింగ్ స్టైల్ సెలబ్రేషన్స్ అన్ని గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అతని పేరు క్రికెట్ కంటే ఎక్కువగా లవ్ స్టోరీ కారణంగానే చర్చల్లో నిలవడం విశేషం. ఇటీవలే తన సోషయల్ మీడియా అకౌంట్ లో సోఫీ షైన్ అనే యువతితో ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో కి సింపుల్ గా హార్ట్ సింబల్ ఉన్నటువంటి ఎమోజీ ని యాడ్ చేశాడు. అదేవిధంగా మై లవ్ అని రాసుకొచ్చాడు. ఇది చూసినటువంటి అభిమానులు విషెష్ కూడా చెప్పారు. ఇక ఈ పోస్ట్ తో సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ధావన్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో సోఫీ షైన్ గురించి చర్చించడం మొదలుపెట్టారు.
Also Read : Indian cricketers : బజ్జీలు, హమాలీ, సిమెంట్ పనులు చేసుకుంటున్న టీమిండియా ప్లేయర్లు
తాజాగా సోఫీ షైన్ తో జిమ్ లో కనిపించాడు. జిమ్ లోనే తన ప్రియురాలుతో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్ చేస్తున్నాడు. ఇద్దరూ ఓ ఫోటో కి పోజులు ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది. వాస్తవానికి సోఫీ షైన్ ఐర్లాండ్ కి చెందిన యువతి.. పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వైరల్ అయిన ఓ ఫోటో శిఖర్ ధావన్ మిస్టరీ ఉమన్ తో కనిపించాడు. ఇటీవలే శిఖర్ సోఫీ తన గర్ల్ ఫ్రెండ్ అని ఓ ఇంటర్ల్యూలో చెప్పుకొచ్చాడట. ఆ క్షణం నుంచే మీడియా సోఫీ షైన్ పై ఫోకస్ చేసింది. హాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సోఫీ షైన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఒక ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం అబుదాబిలో పని చేస్తున్నారు. సోఫీ షైన్ లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
మరోవైపు తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషా ముఖర్జీని కూడా శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జోడీ.. 2012లో పెళ్లితో ఒక్కటైంది. అప్పటికే ఆయేషా ముఖర్జీ కి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంది. తన కొడుకు జొరావర్ ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి తన ప్రియురాలు తో కలిసి జిమ్ లో ఉన్నటువంటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుండటం విశేషం.
Shikhar Dhawan in the gym with rumoured girlfriend Sophie Shine 💪📸#ShikharDhawan #SophieShine #CricketTwitter pic.twitter.com/rv4bPqKVeg
— InsideSport (@InsideSportIND) May 15, 2025