OTT Movie : ఓటిటిలో ఇప్పుడు వెబ్ సిరీస్ లు, డిఫెరెంట్ స్టోరీలతో వరుసగా వస్తూనే ఉన్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లు, మంచి కంటెంట్ తో ఓటిటిని షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక వెబ్ సిరీస్, ఓటిటిలో దుమ్ము దులుపుతోంది. ఈ స్టోరీ ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
కుల్దీప్, శాన్వికా కాలేజ్ లో లవ్ చేసుకుంటూ ఉంటారు. శాన్వికా అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయి. అయితే కుల్దీప్ పేదవాడు కావడంతో వీళ్లు రహస్యంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు వీళ్ళ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు తెలిసిపోతుంది. కులదీప్ ని, వాళ్ళ ఫ్యామిలీని,శాన్వికా కుటుంబ సభ్యులు దారుణంగా కొడతారు. ఇందులో ట్విస్ట్ ఏమంటే, శాన్వికా కూడా కుల్దీప్ తో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది. అతనే నా వెంటపడ్డాడని అబద్ధం చెప్తుంది. ఇంతలో ఆ ఊరి పెద్దలు ఈ ఫ్యామిలీని ఇంట్లో బంధించి నిప్పు పెడతారు. అందరూ చనిపోయారు అనుకుంటారు కానీ, వాళ్ళు తప్పించుకొని సిటీకి పారిపోతారు. అక్కడ కులదీప్ రిక్షా నడుపుతూ కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని చెల్లి, తల్లి అవమానంతో చనిపోతారు. తరువాత తనలో ఉన్న కసిని చదువు మీద చూపించి, ఒక అమ్మాయి సాయంతో కలెక్టర్ కూడా అవుతాడు. కలెక్టర్ గా సొంత ఊరికే వచ్చి శాన్వికా ఫ్యామిలీ మీద పగ పడతాడు.
తన పవర్ ఇంకా బలంగా ఉండటానికి, ఒక మినిస్టర్ కూతురిని పెళ్లి కూడా చేసుకుంటాడు. మరోవైపు శాన్వికాకు కూడా పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు కుల్దీప్ మొదలు పెట్టిన యుద్ధంలో, శాన్వికా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతుంది. అతని తండ్రి కూడా చనిపోతాడు. శాన్వికా భర్తని కూడా ఒక కుట్రలో చంపేస్తారు. ఈ క్రమంలోనే శాన్వికా ఆరోజు అబద్ధం చెప్పడానికి కారణం, కుల్దీప్ తెలుసుకుంటాడు. ఆమె తండ్రి కుల్దీప్ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించడంతోనే అలా చెప్పి ఉంటుంది. అన్నీ జరిగిపోయాక ఈ విషయం కుల్దీప్ కి తెలుస్తుంది. శాన్వికా ఇప్పుడు తండ్రి, భర్తను కోల్పోయి కుల్దీప్ పై రివేంజ్ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. చివరికి శాన్వికా కుల్దీపై రివేంజ్ ఏవిధంగా తీర్చుకుంటుంది ? కుల్దీప్ తన ప్రియురాలిని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు ? వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణలో ఇంకెంత మంది బలవుతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.
Read Also : సొంత పిల్లలనే చంపాలనుకునే తల్లి… ఈ దెయ్యం కోరికలు చూస్తే గుండె జారిపోద్ది భయ్యా
జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో
ఈ రొమాంటిక్ రివేంజ్ సిరీస్ పేరు ‘తుక్రా కే మేరా ప్యార్'(Thukra ke mera pyaar). ఈ సిరీస్ ఉత్తర ప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది ఇందులో ధవల్ ఠాకూర్, సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కు శ్రద్ధా పాసి జైరత్ దర్శకత్వం వహించారు. బాంబే షో స్టూడియోస్ దీనిని నిర్మించింది. ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించబడిన షోగా ఈ సిరీస్ రికార్డ్ కి ఎక్కింది. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో స్ట్రీమ్ అవుతుంది