AP Jobs: మీరు టెన్త్ పూర్తి చేశారా.. ఇంటి వద్ద ఖాళీగా ఉన్నారా.. అయితే ఈ జాబ్స్ మీకోసమే. 3 నెలల ట్రైనింగ్ తో పాటు జాబ్ కూడా పొందే అవకాశంను ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. ఇంటర్వ్యూ తేదీ కూడా ఈనెల 10 కాగా, మరెందుకు ఆలస్యం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. పూర్తి వివరాలు మీకోసం..
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్నది డ్రోన్స్ కాలమని, ప్రతి ఒక్కరూ డ్రోన్స్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మనిషి చేయలేని పనిని డ్రోన్స్ పూర్తి చేస్తాయని, అందుకే డ్రోన్స్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. భవిష్యత్ లో ఏపీ డ్రోన్స్ హబ్ కి కేంద్రంగా గుర్తింపు పొందేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అలా సీఎం చంద్రబాబు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పదవ తరగతి పూర్తి చేసిన వారికి మంచి సువర్ణావకాశం కల్పించారు. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డ్రోన్ పైలట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంభందిత అధికారులు ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టుకు పది పూర్తి చేసిన వారు అర్హులుగా తెలిపిన అధికారులు, డిసెంబర్ 9వతేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెలకు రూ.19వేలతో జాబ్ సౌకర్యం కూడ కల్పిస్తామన్నారు. అయితే టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలని, డిసెంబర్ 10న గుంటూరులోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు.
ఆసక్తి కలిగిన వారు వివరాలకు 8074607278, 99888 53335, 8712655686 నంబర్లకు సంప్రదించాలని కోరారు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేవారు రెస్యూమ్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ విద్యా ధృవీకరణ పత్రాలు, ఆధార్ లేదా పాన్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. మరి మీరు పది పూర్తి చేసి ఉంటే, తప్పక ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఉచిత శిక్షణతో పాటు, జాబ్ సౌకర్యం కూడా కల్పిస్తుండగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు.