BigTV English

NTR 33 : వెట్రిమారన్ ను పక్కన పెట్టిన తారక్.. మరో తమిళ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ

NTR 33 : వెట్రిమారన్ ను పక్కన పెట్టిన తారక్.. మరో తమిళ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ

NTR 33 : ‘దేవర’ (Devara) హిట్ తరువాత ఎన్టీఆర్ (Jr NTR) దూకుడు మీదున్నారు. ప్రస్తుతం ఆయన ‘వార్ 2’ (War 2) సినిమా చేస్తున్నారు. తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ చేయనున్న ప్రాజెక్టు ఏంటి అనేదానికి సమాధానంగా తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.


జూనియర్ ‘ఎన్టీఆర్ 33’ ((NTR 33))వ సినిమా గురించిన వార్తలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే టాక్ తో ఈ ప్రాజెక్ట్ చుట్టూ బజ్ మరింత పెరిగింది. నిన్న మొన్నటిదాకా ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్ ‘ఎన్టీఆర్ 33’వ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తారని టాక్ నడిచింది. కానీ తాజా వార్తల ప్రకారం ‘ఎన్టీఆర్ 33’కి డైరెక్టర్ వెట్రి మారన్ కాదు మరొ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అని తెలుస్తోంది.

కొలమావు కోకిల, బీస్ట్, జైలర్, బ్లడీ బెగ్గర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న నెల్సన్ (Nelson Dileep Kumar) కథ గురించి చర్చించడానికి ఎన్టీఆర్‌ను చాలాసార్లు కలిశాడు. అయితే ఆయన తన దగ్గరున్న పలు కథలను ఎన్టీఆర్ ముందుంచగా, ఓ కథకు ఎన్టీఆర్ ఫిదా అయ్యారని టాక్ నడుస్తోంది. ఆ స్టోరీని ఎన్టీఆర్ లాక్ చేయగా, రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ మూవీని నిర్మించడానికి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వార్త. ముఖ్యంగా ఈ కాంబో మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని అంటున్నారు.


RRR విజయం తర్వాత ‘వార్ 2’ వంటి తన రాబోయే ప్రాజెక్ట్‌లతో ఎన్టీఆర్ (Jr NTR) స్టార్‌డమ్‌ను మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తన నెక్స్ట్ సినిమాలను ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. నెల్సన్ ఇటీవలి విజయాలు ముఖ్యంగా రజనీకాంత్‌తో తీసిన ‘జైలర్’ హిట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కాంబోలో రాబోతున్న మూవీ గేమ్-ఛేంజర్ అని అంటున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది మాత్రం ఇంకా డౌట్ గానే ఉంది. నెల్సన్ ఇప్పుడు ‘జైలర్ 2’ తీయాల్సి ఉంది. దీనికి సుదీర్ఘ పోస్ట్-ప్రొడక్షన్ పీరియడ్‌ ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలోనే ‘దేవర’ (Devara) మూవీతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ మళ్లీ దానికి సీక్వెల్ ‘దేవర 2’ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఈ మూవీ లేట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే చాలా ఆలస్యం అవుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, జనవరిలో ప్రశాంత్ నీన్ ప్రాజెక్టు షురూ చేయబోతున్నారు. ఆ తరువాతే దిలీప్ తో, నెక్స్ట్ ‘దేవర’ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×