Cultural Heart of India: ముక్కోటి దేవతలు ప్రాణం పోసుకునేే స్థలం.. వింటుంటేనే ఆశ్ఛర్యంగా అనిపిస్తుంది కదా..? అలాంటి ప్లెస్‌కి కనీసం ఒక్కసారైనా వెళ్లాలి. అది ఎక్కడుందబ్బా అని అలోచిస్తున్నారా..? ఎక్కడో కాదు ఇండియాలోనే ఉంది. ఆ ప్రదేశం మరేదో కాదు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న కోల్‌కతానే..! అందుకే దీన్ని కల్చరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మరి, దేవుళ్లకు కోల్‌కతాకు కనెక్షన్ ఏంటంటే..
ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా రాజధానిగా పిలువబడే సిటీ ఆఫ్ జాయ్.. నేడు కళ, సాహిత్యం, ఫుడ్, వాస్తుశిల్పం వంటి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్న ప్లేస్. కోల్‌కతా టూర్ ప్లాన్ చేయాలి అనుకున్న వారు మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు. కోల్‌కతాలో చూడాల్సిన ఫేమస్ ప్లేసెస్ లిస్ట్ ఇప్పుడే రెడీ చేసుకోండి..
కోల్‌కతా టూర్ లిస్ట్ అంటే విక్టోరియా మెమోరియల్ ఉండాల్సిందే. క్వీన్ విక్టోరియా గౌరవార్థం దీన్ని నిర్మించారట. ఈ తెల్ల పాలరాయి అద్భుతం, పచ్చని తోటలతో చుట్టుముట్టబడి బ్రిటిష్ వలసరాజ్యాల వాస్తుశిల్పం గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని అందరూ అంటారు. లోపల ఉన్న మ్యూజియంలో సిటీకి సంబంధించిన అమూల్యమైన కళాఖండాలు, పెయింటింగ్‌లు, మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి.
కోల్‌కతా, హౌరా జంట నగరాలను కలుపుతూ, హౌరా బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ వంతెనలలో ఇదీ ఒకటి.
ALSO READ: అనంతగిరి అందాలు చూసొద్దామా..?
ఓల్డ్ కోల్‌కతాను ‘ఎ లివింగ్ హెరిటేజ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే వీధులు, భవనాలు, ప్రాంతాలను ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడ ఉండూ శ్యాంబజార్, బాగ్‌బజార్, కాలేజ్ స్ట్రీట్ వంటి ప్రాంతాలకు వెళ్తే వేరే యుగంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇరుకైన దారులు, అందమైన బాల్కనీలతో భవనాలు కనువిందు చేస్తాయి. 1835లో నిర్మించిన మార్బుల్ ప్యాలెస్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఉండే బెంగాలీల రిచ్ లైఫ్ స్టైల్‌కి అది ఒక సాంపుల్ మాత్రమే.
కుమర్తులిని దేవుళ్లు జన్మించే ప్రాంతం అని కూడా పిలుస్తారట. ఇక్కడ చాలా మంది దేవుళ్లు ప్రాణం పోసుకుంటారు. భారతదేశం అంతటా పూజించబడే హిందూ దేవతల విగ్రహాలను ఇక్కడే చెక్కుతారట. అందుకే దీన్ని ముక్కోటి దేవతలు ప్రాణం పోసుకునేే స్థలం అంటారట.
సౌత్ కోల్‌కతాను ‘ది స్ట్రీట్ దట్ నెవర్ స్లీప్స్’ అని కూడా పిలుస్తారట. ఇక్కడ పార్క్ స్ట్రీట్, కేఫ్‌లు, పబ్‌లు, బుక్ స్టోర్స్ ఉంటాయి. సమీపంలోనే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, ఇండియన్ మ్యూజియం ఉంటుంది. ఇది ఆసియాలో పురాతనమైనదట.
ఓవైపు అర్బనైజేషన్ అనే ఒక ఛాలెంజ్ ఉన్నప్పటికీ, కోల్‌కతా తన నిర్మాణ వారసత్వాన్ని కాపాడుతూనే ఉంది. కోల్‌కతాలో ఓల్డ్ కాలేజ్ క్యాంటీన్‌లో టీ తాగుతున్నా, ప్రిన్సెప్ ఘాట్ నుండి సూర్యాస్తమయాన్ని చూస్తున్నా వచ్చే అనుభూతి వర్ణించలేనిది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.