BigTV English
Advertisement

Madharasi Release Date: ‘మద్రాసి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మురుగదాస్ స్పీడ్‌కు ఫ్యాన్స్ షాక్..

Madharasi Release Date: ‘మద్రాసి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మురుగదాస్ స్పీడ్‌కు ఫ్యాన్స్ షాక్..

Madharasi Release Date: ఒక సినిమాకు కథ సిద్ధం చేసుకోవడం, దానికి క్యాస్టింగ్ కన్ఫర్మ్ చేయడం, ఆపై షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం.. దీనికి చాలానే సమయం పడుతుంది. కానీ కొందరు దర్శకులు మాత్రం ఒక సినిమా తెరకెక్కించడానికి ఒక డెడ్‌లైన్ పెట్టుకొని అందులోనే కచ్చితంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కూడా అదే పనిచేసినట్టున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఈయన ఒక సినిమా కాదు.. రెండు సినిమాలకు డెడ్‌లైన్ పెట్టుకొని ఆ రెండిటి కోసం కష్టపడి బ్యాక్ టు బ్యాక్ రెండిటినీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన స్పీడ్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు.


రొటీన్ అయిపోయింది

ఏఆర్ మురుగదాస్ ఇటీవల సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ అనే సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ మూవీని అనౌన్స్ చేసే ముందే శివకార్తికేయన్‌తో ఒక సినిమాను ప్రారంభించాడు మురుగదాస్. కారణమేంటో తెలియదు కానీ.. శివకార్తికేయన్‌తో చేయాల్సిన సినిమాను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాడు ఈ దర్శకుడు. పూర్తిగా సల్మాన్ ‘సికందర్’పైనే ఫోకస్ చేశాడు. అలా త్వరత్వరగా ‘సికందర్’ షూటింగ్‌ను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొచ్చాడు. సల్మాన్ ఇతర సినిమాల లాగానే ఇది కూడా రొటీన్ అయిపోయిందని ఆడియన్స్ దీనిని ఆదరించలేదు. అందుకే శివకార్తికేయన్ మూవీతో అయినా తను కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


కమ్ బ్యాక్ కావాలి

శివకార్తికేయన్ (Sivakarthikeyan), మురుగదాస్ (Murugadoss) కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా షూటింగ్ అసలు ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియదు.. కానీ ‘సికందర్’ విడుదల అవ్వగానే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. దీనికి ‘మద్రాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్సే లభించింది. మురుగదాస్ దర్శకుడిగా ఒక హిట్ కొట్టి చాలాకాలం అయ్యింది. ‘సికందర్’ కూడా ఊహించినంత రేంజ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అందుకే ప్రేక్షకులతో పాటు మురుగదాస్ కూడా ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఫైనల్‌గా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

Also Read: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?

మంచి మార్కెట్

2025 సెప్టెంబర్ 5న ‘మద్రాసి’ (Madharasi) సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఒక కొత్త పోస్టర్‌తో ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలా మంచి క్యాస్టింగ్‌తో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా తన చివరి సినమా ‘అమరన్’ అయితే ఒక రేంజ్‌లో హిట్ అయ్యింది. స్టార్ హీరోలకు పోటీనిచ్చే రేంజ్‌లో ఈ మూవీకి కలెక్షన్స్ వచ్చాయి. అలా శివకార్తికేయన్ మార్కెట్ పెరగడం ‘మద్రాసి’ మూవీకి ప్లస్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అదే నిజమయితే ఈ హీరో వల్ల దర్శకుడు కూడా మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×