Kochi to Munnar Seaplane Service: దేశంలోని మారుమూల, ప్రాంతీయ ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తోంది. టూరిస్టులు, సామాన్య ప్రజలు పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విమానంలో ప్రయాణించేలా ఈ పథకం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా రీసెంట్ గా విజయవాడ, శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. విజయవాడ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి విజయవాడకు సీ ప్లేన్ ద్వారా పర్యాటకులు ప్రయాణిస్తున్నారు.
కొచ్చి- మున్నార్ మధ్య సీ ప్లేన్ సేవలు
ఆంధ్రప్రదేశ్ లో సీ ప్లేన్ సేవలు సక్సెస్ అయిన నేపథ్యంలో కేరళలో ఈ సర్వీసులను ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రోడ్డు మార్గంలో కొచ్చి నుంచి మున్నార్ చేరుకోవడానికి 3.5 గంటలు పడుతుంది. సీ ప్లేన్ సేవలు ప్రారంభం అయితే, కేవలం 25 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పర్యాటకులు నెరియమంగళం, ఆదిమాలి మార్గాల ద్వారా మున్నార్‌కు వెళుతున్నారు. ఈ మార్గంలో దాదాపు 14 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ రాత్రి పూట ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అందుకే మధ్యాహ్నానికే బయల్దేరుతారు. ప్రయాణ పరిమితుల కారణంగా టూరిజం అనుకున్న స్థాయిలో అభివృద్ధి కావడం లేదు. ఈ నేపథ్యంలో కొచ్చి నుంచి మున్నార్ కు సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
సీ ప్లేన్ సర్వీసులు, టికెట్ చార్జీల వివరాలు
కెనడాలోని డి హావిలాండ్ కంపెనీకి చెందిన 17-సీట్ల సీ ప్లేన్ స్పైస్ జెట్ సపోర్టుతో రీసెంట్ గా టెస్ట్ రన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ప్రస్తుతం ఈ సీ ప్లేన్ సర్వీసులు టెస్ట్ దశలో ఉన్న నేపథ్యంలో టికెట్ ఛార్జీలు ప్రకటించలేదు. గతంలో UDAN పథకం కింద గురుగ్రామ్ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సీ ప్లేన్ ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటే.. రూ. 1,500 నుంచి రూ. 5,000 వరకు ఉంటాయి. ఈ సీ ప్లేన్ టికెట్లను spiceshuttle.com వెబ్ సైట్ తో పాటు ఇతర వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. సీ ప్లేన్ సర్వీసులు డే టైమ్ లోనే నడుస్తాయి. ఈ విమానంలో ప్రయాణించే వాళ్లు 25 కేజీల లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాటిలో 20 చెక్-ఇన్ బ్యాగేజీగా, 5 కిలోల క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
సీ ప్లేన్లతో ఏనుగులకు ఇబ్బంది!
అటు సీ ప్లేన్స్ శబ్దం కారణంగా మట్టుపెట్టిలో ఏనుగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమీప అటవీ ప్రాంతంలో పది ఏనుగులు ఉన్నాయి. మట్టుపెట్టి డ్యాం పరిసర ప్రాంతాలకు నీరు తాగేందుకు తరచూ వస్తుంటారు. సీ ప్లేన్ శబ్దం కారణంగా ఏనుగులు భయపడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఇడుక్కి డ్యామ్‌లో దించాలి అనుకున్న సీ ప్లేన్ ను, మట్టుపెట్టి రిజర్వాయర్ లో దించేందుకు టూరిజం అధికారులు నిర్ణయించారు.
Read Also: జస్ట్ గంటన్నరలో విజయవాడ నుంచి శ్రీశైలానికి.. సీ ప్లేన్ లో ఇలా విహరించండి!