Rashmi Desai: ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ కు క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్య అని చెప్పాలి. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఇలాంటి సమస్యలను అన్ని దాటుకొని నిలబడిన వాళ్లే స్టార్స్ గా మారుతున్నారు. వాటిని ఎదుర్కొలేని వారు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ మొదట్లో ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తాము సక్సెస్ అయ్యాక బయటపెడుతుంటారు.
తాజాగా భోజ్ పురి నటి రష్మీ దేశాయ్ అలానే చేసింది. బుల్లితెరనటిగా కెరీర్ ను ప్రారంభించిన రష్మీ.. డ్యాన్సర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇక 2002లో హిందీ సినిమా కన్యాదాన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి భోజ్‌పురి, ఇంగ్లీష్, గుజరాతీ, ఉర్దూ భాష సినిమాల్లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మీ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Amaran: ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టిన ఏ రంగులే వీడియో సాంగ్ వచ్చేసింది..
” నేను 16 ఏళ్ల వయస్సులో ఒక ఆడిషన్ కు వెళ్లాను. వచ్చేముందు వాళ్లు నన్ను ఒంటరిగా రమ్మన్నారు. కొంచెం భయపడుకుంటూనే వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. నన్ను గదిలోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అతను ఏం చేశాడో తెలియదు. నేను కళ్లు తిరిగి పడిపోయాను. మత్తు మందు చల్లాడేమో.. నాకు కొద్దికొద్దిగా తెలుస్తుంది. అతను నాతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
నేను చాలా ప్రయత్నిస్తున్నా.. బయటకు వెళ్ళడానికి. నన్ను లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలాగోలా అక్కడనుంచి బయటపడ్డాను. ఇంటికి వెళ్ళాక ఈ విషయం మొత్తం మా అమ్మకు చెప్పాను. ఉదయానే నన్ను తీసుకెళ్లి.. అతను ముందు నిలబెట్టింది. మా అమ్మను, నన్ను చూడగానే అతను నాతో అలా ప్రవర్తించినందుకు సారీ చెప్పాడు. వెంటనే మా అమ్మ అతడి చెంప పగులగొట్టింది. అతడికి పెద్ద గుణపాఠం నేర్పింది. ఇండస్ట్రీలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు. మంచివారిని కలిసి.. వారితో పనిచేయాలని ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.