అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది. అదృష్టవంతులు అందుకుంటారు. దురదృష్టవంతులు వదులుకుంటారు. తాజాగా ఓ విమాన ప్రయాణీకుడికి కూడా అనుకోని అదృష్టం కలిగింది. డెల్టా ఎయిర్ లైన్స్ లో చికాగో నుంచి సీటెల్ కు వెళ్లే ఓ ప్రయాణీకుడికి సదరు విమానయాన సంస్థ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. విమానం దిగితే ఏకంగా $3,000 (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.5 లక్షలు) ఆఫర్ చేసింది. ఊహించని ఆఫర్ రావడంతో సదరు ప్రయాణీకుడు హ్యాపీగా ఓకే చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
విమానం టేకాఫ్ కావడానికి కొద్ది సేపటి ముందు ఇంధన రీబ్యాలెన్సింగ్ సమస్య ఎదురయ్యింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రయాణీకులను కిందికి దింపాలని డెల్టా ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఓ ప్రయాణీకుడికి చెప్పడంతో పాటు క్రేజీ ఆఫర్ ఇచ్చింది. సదరు కంపెనీ ఇచ్చిన ఆఫర్ కు తను సంతోషంగా ఓకే చెప్పాడు. “నేను చికాగో నుంచి సీటెల్ కు డెల్టా విమానంలో ఉదయం 7:50 గంటలకు బుక్ చేసుకున్నాను. ఈస్టర్ తర్వాత సోమవారం రోజు నా ప్రయాణం కావడంతో విమానం గరిష్ట సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేను జోన్ 2లో ఎక్కాను. 10వ వరుసలో నా సీటులో కూర్చున్నాను. అప్పుడు ఓ గేట్ ఏజెంట్ ఫస్ట్ క్లాస్ ముందు వైపుకు నడిచాడు. మైక్ లేదు, అనౌన్స్ మెంట్ లేదు. నా దగ్గరికి వచ్చి “ఇంధన రీబ్యాలెన్సింగ్ సమస్యల కారణంగా మేము ఇద్దరు వాలంటీర్లను దింపడానికి వెతుకుతున్నాము. ఒకవేళ మీరు దిగుతాను అంటే, $3,000 ఇస్తాం” అని చెప్పారు” అని వివరించాడు.
క్రేజీ ఆఫర్ ను వెంటనే యాక్సెప్ట్ చేసిన ప్రయాణీకుడు
డెల్టా ఎయిర్ లైన్స్ ఇచ్చిన ఆఫర్ ను వెంటనే యాక్సెప్ట్ చేసినట్లు సదరు ప్రయాణీకుడు చెప్పాడు. “విమానయాన సంస్థ ఇచ్చిన క్రేజీ ఆఫర్ నాకు ఎంతగానో నచ్చింది. వెంటనే యాక్సెప్ట్ చేశారు. వారు నాకు రెండు వోచర్లను అందజేశారు. అందులో ఒకటి $2000 క్రెడిట్, మరొక $1000 క్రెడిట్ వోచర్. వోచర్లు మాత్రమే కాదు, అమెజాన్, ఎయిర్ బిఎన్‌బి లాంటి ప్రధాన రిటైలర్లకు రియల్ గిఫ్ట్ కార్డులుగా మార్చుకునే అవకాశం కల్పిచారు. కొద్ది సమయంలో ఏకంగా $3000 పొందడం సంతోషంగా ఉంది” అని సదరు ప్రయాణీకుడు వివరించాడు.
Read Also: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్, కాశ్మీర్ రైల్వే లింక్ భద్రత కట్టుదిట్టం!
ప్రయాణీకులకు డెల్టా ఎయిర్ లైన్స్ క్రేజీ ఆఫర్లు
ఇక అదే రోజు పలు రకాల కారణాలతో విమానం నుంచి దిగడానికి డెల్టా ఎయిర్ లైన్స్ 22 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి $1,700 ఆఫర్ చేసింది. ఒక రోజులో సదరు సంస్థ తమ విమానాలలో సమస్యల కారణంగా దాదాపు $43,400 ఖర్చు చేసింది. సంస్థ ఇచ్చిన ఆఫర్ ను చాలా మంది ప్యాసింజర్లు సంతోషంగా యాక్సెప్ట్ చేశారు.
Read Also: లోకో పైలెట్లపై తీవ్ర పని ఒత్తిడి, రైల్వే విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి!