Prabhas: టాలీవుడ్ యంగ్ కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా (ఏప్రిల్ 25న) ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇంద్రగంటి మొహాన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ కనిపించారు. అసలు ఈ సినిమాలో కనపడిన పాన్ ఇండియా స్టార్ ఎవరు ? ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమాలో డార్లింగ్..
ఇంద్రగంటి మోహన్ కృష్ణ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, కామెడీ అన్ని జోనర్లను కలిపి ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో ప్రియదర్శి జాతకాలు బాగా నమ్మే వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఈ సినిమాలో ఒక సీన్ లో ప్రియదర్శి రూమ్ లో ప్రభాస్ ఫోటో మనకు కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో హీరో ప్రియదర్శి ప్రభాస్ ఫ్యాన్ గా, కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలోని ఒక సీన్ లో ప్రియదర్శి డైలాగ్ చెప్తుంటే వెనకాల గోడమీద ప్రభాస్ పోస్టర్ మరోవైపు చార్లీ చాపేన్ ఫోటో, క్యాలెండర్ కనిపిస్తాయి. ఆయనకి ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు ప్రభాస్ మరొకరు చార్లీ చాప్ అని సింబాలిక్ గా ఈ రెండు ఫోటోలను చూపించడం జరుగుతుంది. ఇది చూసిన వారంతా ప్రియదర్శిని సినిమాలో డార్లింగ్ ఫ్యాన్ గా కనిపించాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను వదిలేశారు.. లేదంటే ఈ పాటికి థియేటర్లు తగలబడి పోయేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా కథ ..
ఇక కథ విషయానికి వస్తే .. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడతారు. అదే టైంలో జాతకాలని బాగా నమ్మే సారంగపాణి తన జాతకం చేయించుకోవడానికి వెళ్ళడం, అక్కడ తన చేయి చూసి జిగ్నేశ్వర్ అనే వ్యక్తిని నువ్వు ఒక హత్య చేస్తావు అని చెప్తాడు. దాంతో పెళ్లికి ముందే హత్య చేయాలని సారంగపాణి తన స్నేహితుడు చందుతో కలిసి ప్లాన్ చేస్తాడు. అసలు ఎవరిని హత్య చేయాలని అనుకుంటారు, నిజంగానే హత్య చేశారా లేదా తెలియాలంటే మనం థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.. ఈ సినిమా మొత్తం కామెడీ తో కడుపుబ్బా ప్రేక్షకుడిని నవ్వించారు డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్ గా రూప కోడువాయుర్ నటించారు. ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ అందించారు. సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
Telugu Movies : ఒక్క రోజే 12 సినిమాలు విడుదల.. ఓసారి లుక్కేయండి
#Prabhas𓃵 anna Poster in #SarangapaniJathakam movie 🔥🔥 #rebelstar #Prabhas @PriyadarshiPN 👏👏👏 pic.twitter.com/Dicauq7weP
— Anchor Chandu (@Actor_Chandu_) April 25, 2025