Chinese Tourist Injuries:సెల్పీలు, రీల్స్ పిచ్చితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫోటోలు దిగుతూ రకరకాల ప్రమాదాలకు గురై ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ జనాల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ చైనీస్ పర్యాటకురాలు కదులుతున్న రైల్లో ‘రాధేశ్యామ్’ సినిమాలో పూజా హెగ్డేలా ఫోజులుల ఇవ్వాలనుకుంది. రైలు నుంచి బయటకు వంగి ఫోటోకు ఫోజు ఇవ్వగానే సొరంగం గోడకు తల ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతోంది.
శ్రీలంకలో చైనా టూరిస్టుకు గాయాలు
చైనాకు చెందిన ఓ పర్యాటకురాలు రీసెంట్ గా శ్రీలంకలో పర్యటించింది. టూర్ లో భాగంగా ఈ నెల 9న నాను ఓయా-బడుల్లా మార్గంలో రైలు ప్రయాణం చేసింది. ఈ సమయంలో ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణిస్తుంటే, ఫోటోకు ఓ చక్కటి ఫోజు ఇవ్వాలనుకుంది. రెండు చేతులతో రైలును పట్టుకుని బయటకు వంగింది. అదే సమయంలో రైలు సొరంగంలోకి దూసుకెళ్లడంతో ఆమె తల సొరంగం గోడకు బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హఫుటలే హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని చైనా రాయబార కార్యాలయం చైనా నుంచి వచ్చిన పర్యాటకులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రైలు ప్రయాణ సమయంలో డోర్లకు దూరంగా ఉండటంతో పాటు ఫోటోల కోసం రైలు నుంచి బయటకు వంగకూడదని వార్నింగ్ ఇచ్చింది. రైల్వే ట్రాక్ ల ద్వారా ఫోటోలు దిగడం, ఆటలు ఆడటం లాంటి పనులు చేయకూడని సూచించింది.
ఫిబ్రవరిలో రష్యన్ పర్యాటకుడు మృతి
తాజాగా ఘటనలో చైనా పర్యాటకురాలు ప్రాణాలతో బయటపడినా, ఫిబ్రవరిలో జరిగిన రైలు ప్రమాదంలో 53 ఏండ్ల రష్యన్ ప్రయాణీకుడు చనిపోయాడు. ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ, రైల్లో నుంచి జారి పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రదేశంలో ఫోటోలు తీసేందుకు, దిగేందుకు ప్రయత్నించి ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక టూర్ గైడ్ క్రిష్ తెలిపారు. చాలా మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఉన్నాయన్నారు. వీలైనంత వరకు ప్రయాణీకులు ఇక్కడ ఫోటోలు దిగాలన్నా, తీయాలన్నా కాలిప్సో అనే నెమ్మదిగా ప్రయాణించే రైలులో వెళ్లాలని సూచించారు. ఈ రైలు ప్రత్యేకంగా ఫోటోలు తీయాలనుకునే వారి కోసం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
సోషల్ మీడియాలో జోరుగా చర్చ
శ్రీలంకలోని నాను ఓయా-బడుల్లా మార్గంలో ప్రయాణీకులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సినిమాల్లో చూపించినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని సూచిస్తున్నారు. ఒక ఫోటో కోసం జీవితాన్ని కోల్పోవడం సరికాదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: అలర్ట్, 26 రైళ్లు రద్దు.. మీరు వెళ్లే రైళ్లు ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి!