E-Paper
Advertisement

ప్రేమ పెళ్లి పేరుతో యువతి బేరం.. అమ్మాయి పేరెంట్స్ నుంచి డబ్బులు డిమాండ్, ఏలూరు జిల్లాలో ఘటన

ప్రేమ పెళ్లి పేరుతో యువతి బేరం..  అమ్మాయి పేరెంట్స్ నుంచి డబ్బులు డిమాండ్, ఏలూరు జిల్లాలో ఘటన
Advertisement

Eluru: అసలే కలికాలం.. ఈ కాలంలో ఆడపిల్ల పుడితే చాలామంది తల్లిదండ్రులు హడలిపోతారు. అమ్మాయి కాలేజీకి వెళ్లిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయోనని భయంతో బెంబేలెత్తిపోతారు. తాజాగా ప్రేమ పెళ్లి పేరుతో యువతిని బేరం పెట్టారు నలుగురు కుర్రాళ్లు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.

 

ఏలూరు జిల్లాలో ఘటన

Advertisement

ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి కాలేజీలో చదువుతోంది. ఆ యువతిని కొందరు యువకులు బయటకు తీసుకెళ్లారు. బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన ఓ యువకుడితో వీరపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రేమపెళ్లి చేశారు. ఇంతవరకు బాగానే సాగింది. పెళ్లి తర్వాత కూతురు యోగక్షేమాలు తెలియక తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు.

 

ప్రేమ పెళ్లి పేరుతో యువతి బేరం

Advertisement

అదే సమయంలో పెళ్లి తర్వాత యువకుడి తరఫు వ్యక్తులు.. అమ్మాయి తల్లిదండ్రులతో రాయబారం మొదలుపెట్టారు. రూ. 12 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని పంపిస్తామని చెప్పడం మొదలుపెట్టారు. పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె కోసం కన్న తండ్రి రూ. 6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించి ఆడియో రికార్డింగ్‌లు, రాయబారాల సంభాషణలు సోషల్‌మీడియాలో హంగామా చేస్తున్నాయి.

 

అమ్మాయి పేరెంట్స్ నుంచి డబ్బులు డిమాండ్

తమ కూతుర్ని బెదిరించి, కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లి బేరసారాలకు దిగారని ఆరోపించాడు తండ్రి. తమను చూసినా కూతుర్ని రాలేని పరిస్థితిలో ఉంచారని యువతి కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రేమపెళ్లి వ్యవహారం ఏలూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: ముఖం చాటేస్తున్న పులస చేప.. అదేనా అసలు కారణం?

Related News

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

Big Stories

Advertisement
×