Best River Rafting Destinations In India: ప్రపంచంలోనే అత్యంత అందమైన, ఆహ్లాదం కలిగించే రివర్ రాఫ్టింగ్ ప్లేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఫాస్ట్ రివర్ రైడ్స్ ను ఇష్టపడినా, అందమైన ఫ్లోట్ ట్రిప్ లను ఎంజాయ్ చేయాలనుకున్నా, ఇక్కడికి వెళ్తే అన్ లిమిటెడ్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఉత్తరాన మంచుతో కూడిన నదుల నుంచి దక్షిణాన ఉష్ణమండల ట్రైల్స్ వరకు టూరిస్టులను ఆహా అనిపిస్తాయి. ఉత్కంఠ భరితమైన వాటర్ గేమ్స్ ను అందిస్తున్నాయి. ఒకవేళ మీరు వాటర్ రాఫ్టింగ్ కు వెళ్లాలంటే.. ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకోండి..
⦿ గంగా నది, రిషికేశ్, ఉత్తరాఖండ్
ఇండియాలో రివర్ రాఫ్టింగ్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది రిషికేశ్. గంగా నది రాపిడ్లు గ్రేడ్ 1 నుంచి 4 వరకు ఉంటాయి. అప్పుడప్పుడే రివర్ రాఫ్టింగ్ కు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నదీ జలాల్లో రాఫ్టింగ్ చేయడంతో పాటు పట్టణానికి సంబంధించి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ప్రశాంతతను కలిగిస్తాయి. రివర్ రాఫ్టింగ్ కోసం ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు తరలి వస్తుంటారు. ఇక్కడ రాఫ్టింగ్ సెప్టెంబర్ నుంచి జూన్ మధ్య ఎక్కువగా జరుగుతుంది.
⦿ బియాస్ నది, హిమాచల్ ప్రదేశ్
ప్రశాతంగా, ఆహ్లాదకరంగా రాపిడ్‌ల మిశ్రమాన్ని కోరుకుంటే కులు-మనాలీలోని బియాస్ నది బెస్ట్. ఇక్కడ 1 నుంచి 3 రాపిడ్ గ్రేడ్లు ఉంటాయి. చుట్టూ పచ్చని కొండలు రివర్ రాఫ్టింగ్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బియాస్ లో రాఫ్టింగ్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోనూ రాఫ్టింగ్ చేస్తుంటారు.
⦿ అలకనంద నది, ఉత్తరాఖండ్
అలకనంద నది గంగా నదికి ఉపనది కొనసాగుతుంది. ఈ నదిలో రాఫ్టింగ్ అనేది కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ రాపిడ్‌లు గ్రేడ్ IV వరకు వెళ్లవచ్చు. రాఫ్టింగ్ అనుభవం ఉన్న వాళ్లకు బాగా సెట్ అవుతుంది. ఈ నది సుందరమైన లోయలు, పర్వత గ్రామాల గుండా వెళుతుంది. ఓవైపు అడ్వెంచరస్ గా ఉంటూనే మరో వైపు కనువిందు చేస్తుంది. ఇక్కడ రాఫ్టింగ్ సాధారణంగా సెప్టెంబర్ నుంచి జూన్ మధ్యలో ఉంటుంది.
⦿ సింధు నది, లడఖ్
సింధు నదిపై రాఫ్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లడఖ్ ప్రకృతి అందాల గుండా ప్రవహించే నీరు మంచుతో కప్పబడి ఉంటుంది. నదీ చుట్టుపక్కల దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నదిలో ఎక్కువగా గ్రేడ్ 1, 2 రాపిడ్లు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్ 3కి చేరుకోవచ్చు. సింధు నదిపై రాఫ్టింగ్ జూన్ నుంచి ఆగస్టు వరకు బాగుంటుంది. ఆ సమయంలో మంచు కరుగుతుంది.
⦿ తీస్తా నది, సిక్కిం
తీస్తా నది రాఫ్టింగ్ కూడా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇక్కడ నది అనూహ్యమైన ప్రవాహ వేగాన్ని కలిగి ఉంటుంది. దేశంలో అత్యంత సవాలుతో కూడిన రాఫ్టింగ్ గమ్యస్థానాలలో ఇది ఒకటిగా కొనసాగుతుంది. ఇక్కడ 2 నుండి 4 వరకు రాఫ్టింగ్ గ్రేడ్స్ ఉన్నాయి. మంచుతో కప్పబడి ఉన్న ప్రకృతి అందాల నడుమ ఈ రాఫ్టింగ్ ఆకట్టుకుంటుంది. మార్చి నుంచి జూన్ వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ రాఫ్టింగ్ ఆకట్టుకుంటుంది.
⦿ బారాపోల్ నది, కర్ణాటక
సౌత్ ఇండియాలో బెస్ట్ రాఫ్టింగ్ ప్లేస్ రాపోల్ నది. పశ్చిమ కనుమలలో దట్టమైన అడవుల గుండా ఈ నది పారుతుంది. ఇక్కడ గ్రేడ్ 2 నుంచి 4 వరకు రాఫ్టింగ్ గ్రేడ్స్ ఉన్నాయి. ఈ నది చిన్నదైనప్పటికీ ఉత్కంఠభరితమైన రైడ్స్ ను అందిస్తుంది. వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రాఫ్టింగ్ ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read Also: ఫారిన్ లో ఉన్న ఫీలింగ్ కలిగించే బెస్ట్ ఇండియన్ ప్లేసెస్, కచ్చితంగా వెళ్లాల్సిందే!