OTT Movie : థియేటర్లతో సంబంధం లేని వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇవి సినిమాలకు దీటుగా పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీటిలో కొన్ని సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ లు, ఊహకందని ట్విస్ట్ లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక విమానం చుట్టూ తిరుగుతుంది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏమంటే, విమానం లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఐదు సంవత్సరాల తర్వాత భూమి మీదకు వస్తారు. ఆ తర్వాత స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక 828 నంబర్ గల ఫ్లైట్ జమైకా నుండి, న్యూయార్క్‌కు బయలుదేరుతుంది. విమానం గాలిలో కొంత ఒడి దుడుకులను ఎదుర్కొంటుంది. కానీ సురక్షితంగానే ల్యాండ్ అవుతుంది. అయితే ప్రయాణీకులకు దిగిన తరువాత, ఒక మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ విషయం ఒకటి తెలుస్తుంది. వాళ్ళు కొన్ని గంటల సమయం ప్రయాణించామని భావించినప్పటికీ , బయటి ప్రపంచంలో ఐదు సంవత్సరాలు గడచిపోయి ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు, స్నేహితులు, లోకం అంతా ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. కానీ విమానంలోని ప్రయాణీకుల వయసు ఏమాత్రం మారకుండా అలాగే ఉంటారు. ఇప్పుడు స్టోరీ బెన్ స్టోన్ అతని సోదరి మైకెలా స్టోన్, వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతుంది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణీకులకు అందులో ఏదో జరిగిందని అనిపిస్తూ ఉంటుంది. విమానంలోని ప్రయాణీకులకు సమయం గడవకపోవడం వల్ల వారి కుటుంబ సంబంధాలు, సమాజంలో జీవితం గందరగోళంగా మారుతుంది. బెన్ కుమారుడు కాల్, ఐదేళ్లలో వయసులో చాలా చిన్నగా ఉంటాడు, అయితే ఇప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంటాడు. చివరికి విమానం ఎందుకు ఐదేళ్లు అదృశ్యమైంది? ఈ సంఘటన వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా? ఆ సమయంలో ఏం జరిగింది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : పిల్లే కదాని కిడ్నాప్ చేస్తే… ఆ తర్వాత రచ్చ ఉంటదిరా చారీ… పిల్లలతో కలిసి చూడకూడని మూవీ
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ సూపర్ నాచురల్ వెబ్ సిరీస్ పేరు ‘మానిఫెస్ట్’ (Manifest).దీనిని జెఫ్ రాక్ సృష్టించారు. ఈ సిరీస్ 2018 లో రిలీజ్ అవ్వడంతో పాటు, ప్రజాదరణను కూడా పొందింది. ఈ స్టోరీ మోంటెగో ఎయిర్ ఫ్లైట్ 828 చుట్టూ తిరుగుతుంది. దీనిలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు, సిబ్బంది ఐదు సంవత్సరాలు కనిపించకుండా పోతారు. కాని తర్వాత ఊహించని విధంగా తిరిగి తిరిగి వస్తారు. అయితే వారికి మాత్రం సమయం కొన్ని గంటలు మాత్రమే గడిచినట్లు అనిపిస్తుంది. ఈ డిఫెరెంట్ స్టోరీతో వచ్చిన వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.