Intinti Ramayanam Today Episode May 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య కోసం అవని అక్షయలు కోర్టు మెట్లు ఎక్కుతారు.. అక్షయ్ తరుపున లాయరు వాదనలు వినిపిస్తాడు.. అవని తరుపున శ్రీకర్ లాయర్ గా వస్తాడు. శ్రీకర్ని చూసి అందరూ షాక్ అవుతారు. శ్రీకర్ నువ్వేంటి ఇలా ఈ కేసు తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఎంత చెప్పినా కూడా కోర్టులోని లాయర్ ని పేరు పెట్టి పిలవడం బంధుత్వంతో పిలవడం తప్పు అనేసి అవనితో అంటాడు. జడ్జ్ కూడా లాయర్ గా నువ్వు ముందుకు రావడం సంతోషంగా ఉంది నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను ప్రొసీడ్ అని చెప్పేసి అంటాడు.. జడ్జ్ మాత్రం శ్రీకర్ చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకుంటాడు.. తల్లి గొప్పదనం గురించి శ్రీకర్ ఎంతో చక్కగా వర్ణిస్తాడు.. అది విన్న కుటుంబం కూడా తల్లి గొప్పతనం గురించి తెలుసుకుంటుంది.. తల్లిని బిడ్డకు దూరం చేయడం ఎంత పాపమో.. బిడ్డను తల్లి నుంచి వేరు చేయడం అంతే పాపమని శ్రీకర్ ఫైనల్ టచ్ ఇస్తాడు. తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలో లేదో అనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను జడ్జిగారు మీరే ఈ నిర్ణయాన్ని ఫైనల్ చేయండి అని శ్రీకర్ అంటాడు.. శ్రీకర్ వాదనను విన్న జడ్జ్ తల్లిని బిడ్డ నుంచి వేరు చేయడం తప్పు మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ బిడ్డ కోరుకుంటుంది అని అంటాడు. ఆరాధ్య మొత్తానికి తల్లి దగ్గరకు చేరుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆఫీస్ కెళ్ళి ఫ్లవర్స్ ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. అవి నేను చూసిన అక్షయ్ విపరీతమైన కోపంతో అక్కడున్న పూలను కింద పడేస్తాడు. మనుషుల మీద ఉన్న కోపం వస్తువుల మీద ఎందుకు చూపిస్తారని అవని సీరియస్ అవుతుంది.. ఆ బిడ్డను నా నుంచి దూరం చేసావ్ ఆఖరికి నాకు కన్న తండ్రిని నా చెల్లిని కూడా నాకు కాకుండా చేశావు నీకు బంధువుల గురించి ఫ్యామిలీ గురించి ఏమాత్రం తెలియదు ఎందుకంటే నువ్వు ఒక అనాధవి అని దారుణంగా అవమానిస్తాడు.
అక్షయ్ మాటలు విన్న అవని నేను అనాధనే.. ఆ విషయం మీకు తెలిసే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అని బాధపడుతుంది. నేను అనాధను కాబట్టే మీ వాళ్ళందర్నీ నా వాళ్ళు అనుకున్నాను. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టే నా మీద ఎన్ని నిందలు వేసినా అవమానాలు చేసినా కూడా నేను ఏది బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాను అని అవని బాధపడుతుంది.. అక్షయ్ అన్న మాటలకి ఫీల్ అయిపోయిన అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కోపంతో అవని దారుణంగా అవమానిస్తాడు అక్షయ్.. అవని మాత్రం మీరు నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారు నా మనసు విరిగిపోయేలా మాటలు అన్నారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. ఇక అక్షయ్ అవని నేను ఆఫీస్ కి రావద్దు అని చెప్పాలని అనుకుంటాడు. అయితే అవని రాకుండా ఉంటే ఆరాధ్య గురించి తెలుసుకోవడం కష్టమవుతుందని నిర్ణయం తీసుకొని వెనక్కి తగ్గుతాడు. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అయితే శ్రీయ కమల్ కి కాఫీ పెట్టేస్తుంది. ఆకాశానికి ఎత్తేస్తాడు కమల్..
కాఫీ చాలా బాగుంది ఇది తాగుతుంటే నాకు అమృతాన్ని తాగినట్టే ఉంది అని పొగిడేస్తాడు. అయితే అందరికన్నా ఎక్కువ బాగా కాఫీ పెట్టాలంటే అవని తర్వాత ఎవరైనా అమృతాన్ని వేడి చేసినట్టు ఎంత అద్భుతంగా పెడుతుందో అని అవనిని అనడంతో అక్కడివాళ్ళు అంతా సీరియస్ అవుతారు.. ఇక శ్రీకర్ ని అందరి ముందర పొగిడేస్తాడు.. అన్నయ్య మనల్ని పిల్లలు లేని వాళ్ళని ఎన్నో మాట్లాడినాడు ఇప్పుడు తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పావు నువ్వు చాలా గ్రేట్ అన్నయని శ్రీకర్ని పొగిడేస్తాడు.
కోర్టులో అదరగొట్టావ్ అన్నయ్య.. నువ్వు చాలా గ్రేట్ అని శ్రీకర్ ను పొగిడేస్తాడు.. ఆ మాట వినగానే ఇంట్లోనే వాళ్ళందరూ సీరియస్ అవుతారు. మీరు తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలని చూశారు. అని అన్నయ్య మాత్రం ఆ బిడ్డని తల్లి దగ్గరికి చేర్చేలా మాట్లాడాడు అదరగొట్టేస్తాడని అంటాడు. ఆ మాట వినగానే పార్వతీ సీరియస్ అవుతుంది చెంపలు పగలకొట్టేస్తాను నీకు ఏం మాట్లాడుతున్నావ్ తెలియట్లేదా అని అరుస్తుంది..
అప్పుడే ఇంటికి బంధువులు వస్తారు. ఇంట్లో రాజేంద్రప్రసాద్ అవన్నీ లేరు ఎక్కడికి వెళ్లారని అడుగుతారు. ఎప్పటిలాగే ఏదో ఒక అబద్ధం చెప్పేది కవర్ చేస్తుంది. వాళ్లు మా కూతురు పెళ్లి ఫిక్స్ అయింది మీరు తప్పక ఇంట్లోని వాళ్ళందరూ రావాలి అని అంటారు. కమల్ నోటి దూలతో మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇప్పట్లో రాడు అని చెప్పేస్తాడు. ఇంట్లో జరుగుతున్న గొడవలు వల్లే వెళ్ళిపోయాడని అంటాడు. ఇక తర్వాత మీరు వెళ్లిపోయింది మేము మా ఇంట్లో సమస్యలు ఎప్పుడు ఉండేవే కదా అని శ్రీకర్ వాళ్ళని పంపించేస్తాడు.
అందరూ కలిసి ఇంట్లోని విషయాలు బయటకు చెప్తావా కొంచమైనా నీకు బుద్ధుందా అని కమల్ పై సీరియస్ అవుతారు. ఎప్పుడు చెప్పాలో కూడా నీకు తెలియట్లేదు ఇంకెప్పుడు తెలుసుకుంటావని పార్వతి కమల్ ని తిడుతుంది. ఇక తర్వాత రాజేంద్రప్రసాద్ పేపర్ చదువుకుంటూ పార్వతి కాఫీ తీసుకురా అని అంటాడు. ఆ మాట విన్న అవని రాజేంద్రప్రసాద్ కు కాఫీ తెచ్చేస్తుంది. మావయ్య మీరు అత్తయ్య పేరు పిలిచారు.. మీది అత్తయ్యకి ఎంత అన్యోన్యమైన బంధము అందరికీ తెలుసు.. మీరు అత్తయ్యని మర్చిపోలేక పోతున్నారు అంటూ అవన్నీ అడుగుతుంది. అటు పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
అందరూ పార్వతి దగ్గరికి వచ్చి రాజేంద్రప్రసాద్ దగ్గరికి మనం వెళ్దాం పద అని అన్నా కూడా ఆమె నేను రాను నేను వస్తే నా కూతురు నా మనవరాలు నా దగ్గరికి రారు. నా కొడుకుకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను అని బాధపడుతుంది. అటు అవని కూడా రాజేంద్రప్రసాద్ కి మీరు అద్దెని క్షమించి అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మామయ్య అని చెప్పిన కూడా ఆయన వినడు. ఆ తర్వాత భానుమతి బెడ్ పై కూర్చుని పండ్లు తింటూ ఉంటుంది. కమ్మలు భానుమతిని చూసి సీరియస్ అవుతాడు. ఇంట్లో ఇన్ని గొడవలు ఉంటే నువ్వు ప్రశాంతంగా పళ్ళు తింటున్నావా.. అసలు నువ్వేం పెద్ద దానివి పెద్దరికం అంటే సమస్యలు చూస్తూ ఉండడం కాదు సమస్యల్ని పరిష్కరించాలి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్తాడు.. సంతకాల కోసం నీకు తండ్రి గుర్తొచ్చారా అని అక్షయ్ ని దారుణంగా అవమానిస్తాడు రాజేంద్రప్రసాద్. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..