Must Visit Places In India: ఏమాత్రం అవకాశం దొరికినా, విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేయాలని చాలా మంది భావిస్తారు. విదేశాల్లో పర్యటించడం ద్వారా ఉత్తేజకరంగా ఫీలవుతారు. కొత్త అనుభవాలను పొందుతారు. కానీ, వీసా లేకుండా, తక్కువ ఖర్చులో ఫారిన్ కంట్రీస్ లో ఉన్నట్లు ఊహించుకోండి.! ఎంత బాగుందో అనుకుంటున్నారు కదా? నిజమే.. ఇండియాలోనూ ఫారిన్ కంట్రీస్ ను తలదన్నే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే స్విట్జర్లాండ్, ఆమ్ స్టర్ డామ్, స్పెయిన్ లో ఉన్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ ఆ ప్లేసెస్ ఏవి? ఎక్కడున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫారిన్ కంట్రీస్ ను తలపించే 5 ఇండియన్ ప్లేసెస్
⦿ ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్: ఖజ్జియార్ ను ‘మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉంది. ఈ హిల్ స్టేషన్ చుట్టూ గంభీరమైన పర్వతాలు, ఎటు చూసినా కనిపించే పొడవైన పైన్ చెట్లు, అందమైన సరస్సు ఆకట్టుకుంటుంది. అత్యంత ప్రశాంతంగా, అదే సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్లేస్ కు వెళ్తే అచ్చం స్విట్జర్లాండ్ లో ఉన్నామా? అనిపిస్తుంది.
⦿ గుల్మార్గ్, కాశ్మీర్: మంచు కొండల్లో ఆడుకోవాలని ఉన్న వారికి బెస్ట్ ఆప్షన్ కాశ్మీర్ లోని గుల్మార్గ్. ఈ పట్టణం అంతా ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. విభిన్న వృక్షజాలంతో కూడిన అందమైన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇది అనేక స్కీ రిసార్ట్ లను కలిగి ఉంటుంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడి రోప్ వేలో ప్రయాణిస్తూ, స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ పొందవచ్చు.
⦿ అల్లెప్పీ బ్యాక్ వాటర్స్, కేరళ: ఒకవేళ మీరు వెన్నిస్ లాంటి నగరాలను సందర్శించుకోవాలనుకుంటే.. అలాంటి అనుభూతిని పొందేందుకు కేరళలోని అల్లెప్పీ బ్యాక్ వాటర్స్ కు వెళ్లడం మంచిది. ఈ ప్రాంత ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా, అత్యంత ప్రశాంతంగా ఆకట్టుకుంటుంది. హౌస్‌బోట్ క్రూయిజ్‌లు, మెలితిరిగి ఉన్న కాలువలు, మీరు నిజంగా వెన్నిస్ లో ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి.
⦿ అండమాన్ దీవులు: బీచ్ లను ఎక్కువగా ఇష్టపడే వారికి అండమాన్ దీవులు బెస్ట్ ప్లేస్. మృదువైన తెల్లని ఇసుక, పారదర్శకమైన జలాలు, ఉత్సాహభరితమైన సముద్ర జీవులు కనువిందు చేస్తాయి. ఈ దీవులు స్పెయిన్ మాదిరిగా ఆకట్టుకుంటాయి. స్పెయిన్ తో పోలిస్తే ఇక్కడ తక్కువ మంది పర్యాటకులు ఉన్నప్పటికీ, ఎంతగానో ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.
⦿ శ్రీనగర్, కాశ్మీర్: వసంత కాలంలో శ్రీనగర్ కు వెళ్తే.. అచ్చం ఆమ్ స్టర్ డామ్ లోని క్యూకెన్ హాఫ్ తోటలకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోటకు నిలయంగా కొనసాగుతోంది. ఇక్కడ వేల రంగుల పువ్వులు అన్ని దిశలలో వికసించి ఆకట్టుకుంటాయి. డబ్బు, సమయాన్ని వెచ్చించి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లేందుకు బదులుగా శ్రీనగర్ లోని అందమైన తులిప్ తోటలకు వెళ్లడం మంచిది.
Read Also: ఆకాశంలో అద్భుత నిర్మాణం, చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!