Namo Bharat Offer: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు. సోషల్ మీడియా వాడే వారికి రీల్స్ గురించి, షార్ట్ ఫిలిమ్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు రీల్స్ ట్రై చేసే ఉంటారు. మీకూ చక్కగా రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేయడంవచ్చా? అయితే, మీకో గుడ్ న్యూస్. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC).. నమో భారత్ పేరుతో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పోటీని నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ఔత్సాహికులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నది. ఈ పోటీలో కాలేజీ విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్.. ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ రీల్స్ లో ఫ్రెండ్షిప్, రొమాన్స్, థ్రిల్లర్ సహా ఏ థీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ నమో భారత్ రైళ్లు, NCRTC స్టేషన్లను హైలైట్ చేయాలి.
పోటీలో ఎలా పాల్గొనాలంటే?
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నిర్వహించే పోటీలో పాల్గొనే వాళ్లు, తమ వీడియో కంటెంట్ ను ఇంగ్లీష్, హిందీలో మాత్రమే రూపొందించాలి. వీడియోలు 1080 P రిజల్యూషన్‌లో ఉండాలి. MP4 లేదంటే MOV ఫార్మాట్ లో రూపొందించాలి. డిసెంబర్ 20 వరకు వీడియోలను సమర్పించే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనాలి అనుకునే వాళ్లు కచ్చితంగా pr@ncrtc.in కి ‘నమో భారత్ షార్ట్ ఫిలిమ్ మేకింగ్ కాంపిటీషన్ కోసం అప్లికేషన్’ అనే సబ్జెక్ట్ తో మెయిల్ చేయాలి. ఇందులో పూర్తి పేరు, మీరు రూపొందించే షార్ట్ ఫిలిమ్స్ కు సంబంధించిన స్టోరీ. 100 పదాలకు మించకుండా చూసుకోవాలి. షార్ట్ ఫిలిమ్ డ్యురేషన్ ఎంత ఉంటుందో చెప్పాలి.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన టెక్కీ, అసలు ట్విస్ట్ ఏంటంటే?
మూడు బెస్ట్ చిత్రాలకు బహుమతులు
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ పోటీలో పాల్గొనే వారి వీడియో కంటెంట్ ను అధికారులు పరిశీలిస్తారు. వాటిలో నుంచి మూడు బెస్ట్ ఫిలిమ్స్ ను సెలెక్ట్ చేస్తారు. వారికి నగదు బహుమతిని అందిస్తారు. అందులో మొదటి విజేతకు రూ. 1.5 లక్షలు అందిస్తారు. రెండో బహుమతికి సెలెక్ట్ అయినవారికి రూ. లక్ష బహుమతిగా ఇస్తారు. మూడో బహుమతి పొందే వారికి రూ. 50 వేల నగదు అందిస్తారు. అందేకాదు, NCRTC డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లలో టాప్ 3 షార్ట్ ఫిలిమ్స్ ను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆధునిక స్టేషన్లు, నమో భారత్ రైళ్లను సినిమా షూటింగ్‌లు, ఇతర చిత్రాల షూటింగ్ కోసం అద్భుమైన్ లొకేషన్లుగా చూపించేందుకు ఈ పోటీ నిర్వహిస్తున్నది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమా షూటింగులకు అవకాశం కల్పిస్తూ, ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అటు NCRTC అందించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు యువత ప్రయత్నిస్తోంది.