Akkineni Akhil : టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కూడా ఒకటి.. నాగార్జున ఈ వయస్సు లో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలను చేస్తున్నాడు. ఈయన ఇద్దరు కొడుకులు కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆగస్టు లో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డిసెంబర్ 4 న వీరిద్దరి పెళ్లి అనపూర్ణ స్టూడియోలో అంగ రంగా వైభవంగా జరగనుంది. పెళ్లి కోసం నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇక అక్కినేని అఖిల్ కూడా ఓ ఇంటివాడు అవుతున్నాడు.. తాజాగా ఓ మోడల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దుబాయ్ లోని ప్రముఖ వ్యాపార వేత్త కూతురు. వీరిద్దరి పెళ్లి పై అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరి పెళ్లి వేదిక ఎదో ఒకసారి తెలుసుకుందాం..
అక్కినేని అఖిల్ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో హైలెట్ అవుతూ వస్తుంది. ఇక ఓ బిజినెస్ మ్యాన్ కూతురు జైనబ్ రివిడ్జ్‌ను వివాహం చేసుకొనుండటమే దీనికి కారణం. అసలు ఎవరు ఊహించలేని విధంగా అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ చేసుకునే ఆడియన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చాడు. అక్కినేని అఖిల్ త్వరలోనే ప్రముఖ బిజినెస్ మాన్ కూతురు జైనబ్ ను వివాహం చేసుకోబోతున్నాడని రెండు రోజుల క్రితం నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అప్పటి నుంచి ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..
అఖిల్, నాగ చైతన్య ఇద్దరి పెళ్లి ఒకేసారి చేస్తారనే వార్తలు కూడా సోషల్ మీడియా లో వినిపిస్తుంది. ఆ వార్తలకు చెక్ పెడుతూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అఖిల్ పెళ్లి ఈ ఏడాదిలో ఉండదని.. దానికి ఇంకా సమయం ఉంది.. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరి పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేయాలని ఫ్యామిలీ డిసైడ్ అయ్యారట.. వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇక వీరిద్దరు కూడా సింపుల్ గా పెళ్లి చేసుకుంటామని జైనబ్ కూడా అలాగే వాళ్ళ పెళ్లి జరగాలని అనుకుంటుందని వారికి చెప్పి కన్విన్స్ చేశాడట. ఈ క్రమంలోనే అమలా, నాగార్జున అఖిల్ కు నచ్చినట్లుగా సింపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే.. మరో తాజా సెట్ వేసి వీళ్ళ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రీసెప్షన్ గ్రాండ్ గా చెయ్యనున్నారని టాక్.. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. అందరు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. నాగ చైతన్య తండేల్ సినిమా తో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక నాగార్జున కుబేర సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.