E-Paper
Advertisement

శాలరీ అకౌంట్‌ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?

శాలరీ అకౌంట్‌ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?
Advertisement

Salary vs Savings Account: డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో బ్యాంకు ఖాతాల పాత్ర అత్యంత కీలకమైనది. బ్యాంకింగ్ వ్యవస్థలో శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ప్రస్తుతం ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. అత్యధిక మంది ప్రజలు ఈ రెండు ఖాతాలనే వాడుతుండగా.. ఈ అకౌంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఉద్దేశాలు పూర్తి భిన్నమైనవి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఖాతాల మధ్య ప్రధాన వ్యత్యాసాలు, ఏ అకౌంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు యూజర్లకు కలుగుతాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

శాలరీ అకౌంట్ బెనిఫిట్స్

ఉద్యోగులకు ప్రతినెల క్రమం తప్పకుండా జీతం జమ చేయడానికి కంపెనీలు ప్రత్యేకంగా తీసే ఖాతానే ‘శాలరీ అకౌంట్’ అంటారు. ప్రధానంగా ఉద్యోగుల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం కోసం బ్యాంకులు వీటి ద్వారా ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంటాయి. ఈ ఖాతాలకు జీరో బ్యాలెన్స్ సదుపాయం ఉంటుంది. కాబట్టి ఈ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఇది కంపెనీ ద్వారా నేరుగా బ్యాంక్‌తో అనుసంధానమై ఉండటం వల్ల ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతం ఖాతాలో పడిపోతుంది. చాలా బ్యాంకులు శాలరీ అకౌంట్స్ కు చెక్ బుక్స్, డెబిట్ కార్డ్, ప్రమాద బీమా సదుపాయం వంటి సేవలను ఫ్రీగా అందిస్తున్నాయి. ఒకవేళ కొన్ని నెలల పాటు ఈ ఖాతాలోకి జీతం జమ కాకపోతే (ఉద్యోగం మారిన సందర్భాల్లో) బ్యాంకులు దీనిని సాధారణ ‘సేవింగ్స్ అకౌంట్’గా మారుస్తాయి. అప్పటి నుండి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.

సేవింగ్స్ అకౌంట్ ప్రత్యేకతలు

Advertisement

వ్యక్తులు తమ వద్ద ఉన్న సొమ్మును భద్రపరుచుకోవడానికి, పొదుపుపై వడ్డీ పొందడానికి ఉపయోగించే సాధారణ బ్యాంక్ ఖాతాయే ‘సేవింగ్స్ అకౌంట్’. విద్యార్థులు, గృహిణులు, వ్యాపారులు, రిటైర్డ్ వ్యక్తులతో సహా ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. సాధారణంగా ఈ ఖాతాల్లో బ్యాంక్ నిబంధనల ప్రకారం.. మినిమం బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. ఈ ఖాతాలకు ఉండే ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే.. వడ్డీ చెల్లింపు. నిర్ణీత వ్యవధి పూర్తైన తర్వాత బ్యాంకులు ఖాతాలో ఉన్న అమౌంట్ కు సంబంధించి వడ్డీని చెల్లిస్తాయి. దీనివల్ల సేవింగ్స్ డబ్బు క్రమంగా పెరుగుతుంది. బిల్ పేమెంట్స్, రోజువారీ ఖర్చులు, భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!

రెండింటిలో ఏ అకౌంట్ బెటర్?

Advertisement

ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ భయం లేకుండా శాలరీ అకౌంట్ పొందడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ మీ టార్గెట్ డబ్బును పొదుపు చేస్తూ వడ్డీ పొందడం అయితే సేవింగ్స్ అకౌంట్ బెస్ట్ ఆప్షన్ అని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రెండూ అకౌంట్స్ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయని.. అవసరాలను బట్టి సరైన ఖాతాను ఎంచుకుని బ్యాంకింగ్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటే బెటరని సూచిస్తున్నారు.

Also Read: దీపావళి టపాసుల పొగతో కళ్లు, ఊపిరితిత్తులకు ప్రమాదం.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి

Tags

Related News

వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు.. మీ జాబ్ భద్రంగా ఉండాలంటే ఈ 3 స్కిల్స్ తప్పనిసరి

SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. డిసెంబర్ 1 నుంచి అదనపు ఛార్జీలు

వీలునామా vs గిఫ్ట్ డీడ్.. మీ పిల్లలకు ఆస్తి ఏ రూపంలో ఇస్తే మంచిది?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లు మాయం.. మీ డబ్బులు పోతే వెంటనే ఈ 5 పనులు చేయండి

నెల జీతం సరిపోవడం లేదు.. ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న 70 శాతం భారతీయులు

చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

దీపావళి వేళ సిఎంఆర్ జ్యువెలరీ ఆఫర్లు.. బంగారు ఆభరణాలపై భారీగా డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×