E-Paper
Advertisement

టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్!

టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్!
Advertisement

New Toll Pass Rules: జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాల వద్ద నివసించే లోకల్ వాహనదారులకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ‘నేషనల్ హైవేస్ ఫీజ్ రూల్స్ – 2008’ చట్టంలో పలు కీలక సవరణలు చేస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ప్రత్యేకమైన టోల్ పాస్ ప్రయోజనాన్ని కల్పించింది. దీని ద్వారా రోజూ ఆఫీసులు, కళాశాలలు, ఇతర పనుల కోసం టోల్ గేట్ల ద్వారా ప్రయాణించే స్థానిక వాహనదారులకు భారీగా డబ్బు ఆదా కానుంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నున్నట్లు కేంద్రం ప్రకటించింది.

వార్షిక టోల్ పాస్ ఛార్జీలు ఇలా..

టోల్ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏటా చెల్లించాల్సిన టోల్ పాస్ ఫీజును రెండు రకాలు (గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ) గా కేంద్రం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద చెల్లించాల్సిన రుసుమును ఏడాదికి రూ.1500గా ఫిక్స్ చేసింది. మరోవైపు మున్సిపల్ లేదా అర్బన్ సరిహద్దుల పరిధిలో ఉండే టోల్ ప్లాజాల వద్ద వార్షిక పాస్ ఫీజును రూ.3000గా నిర్ణయించింది. అయితే ఈ పాస్ కేవలం నిర్దిష్టంగా దరఖాస్తు చేసుకున్న ఒక్క టోల్ ప్లాజా వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర టోల్ ప్లాజాల వద్ద ఇది వర్తించదని వెల్లడించింది.

టోల్ పాస్ అర్హతలు, నిబంధనలు..

Advertisement

అయితే టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్న అందరికీ ఈ పాస్ నేరుగా వర్తించదు. ఈ పాస్ పొందాలంటే కొన్ని షరతులకు వారు లోబడి ఉండాల్సి ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైనది 20 కి.మీ పరిధి. దరఖాస్తుదారుడు సంబంధిత టోల్ ప్లాజాకు సరిగ్గా 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ ఉండాలి. పైగా ఈ పాస్ కేవరం వ్యక్తిగత, సొంత వాహనాలకు మాత్రమే వర్తించనుంది. వ్యాపార సంబంధిత, కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ పనిచేయదు. మెుత్తంగా ఈ పాస్ పొందాలంటే యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండటంతో పాటు నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా సంబంధిత ప్రభుత్వ ఆధార పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!

మంత్లీ పాస్ ఉంటే ఈ పాస్ వస్తుందా?

Advertisement

వాహనదారులు తమకు అనువైన ‘వార్షిక లోకల్ పాస్’ లేదా ‘నెలవారీ పాస్ (Monthly Pass)’ లలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏడాది పొడవునా ప్రతీరోజూ అనేక సార్లు టోల్ ప్లాజా దాటే వారికి ఈ వార్షిక పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువసార్లు టోల్ ప్లాజాలా గుండా ప్రయాణించేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలియజేస్తున్నారు. అయితే సర్వీస్ రోడ్డు లేదా ఇతర అనుసంధాన రహదారి ఉన్న టోల్ ప్లాజాలలో ఈ రాయితీ పాస్ ఇవ్వరని పేర్కొంటున్నారు.

Also Read: పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు

Tags

Related News

జంతువుల కోసం ఫ్లైఓవరా? కెనడా చేసిన ఈ పనికి.. యావత్ ప్రపంచమే ఫిదా!

అర్నాబ్ తుపాన్ ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 16 విమాన సర్వీసులు రద్దు!

ఎటుచూసినా బంగారమే బంగారం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్డ్ వాక్‌వే..

కేరళలో రైళ్లపై రాళ్లు విసిరిన ఏపీ వ్యక్తి.. చివరకు ఏమైందంటే?

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు కీలక అలర్ట్!

హాస్టల్ లేదా పీజీలో చేరాలనుకుంటున్నారా? పొరపాటున ఈ తప్పులు చేయకండి

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 60కి పైగా రైళ్లు రద్దు!

Big Stories

Advertisement
×