E-Paper
Advertisement

రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!

రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!
Advertisement

Blinkit Refund Scam: బ్లింకిట్ లో ఆర్డర్ చేసిన పెరుగు పాడైపోవడంతో ఆ డబ్బును రిఫండ్ చేసేందుకు యత్నించి ఓ మహిళ దారుణంగా మోసపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గూగుల్ సెర్చ్ లో కనిపించిన ఓ నెంబర్ బ్లింకిట్ కు సంబంధించినదిగా భావించి.. ఏకంగా రూ.98,000 పోగొట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటన.. రిఫండ్ ప్రక్రియను సైతం సైబర్ కేటుగాళ్లు అస్త్రంగా వాడుకుంటున్నారన్న చేదు నిజాన్ని కళ్లకు కడుతోంది.

అసలేం జరిగిందంటే?

బెంగళూరుకు చెందిన బాధితురాలు.. గూగుల్ సెర్చ్‌లో కనిపించిన రెండు నంబర్లలో ఒకదానికి తొలుత ఫోన్ చేశారు. ఆ కాల్ ను రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెకు వాట్సప్ లో ఒక లింక్ పంపి.. పాడైపోయిన పెరుగు ప్యాకెట్ ఫోటోను అందులో అప్లోడ్ చేయమని సూచించారు. ఆమె అలాగే చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, రీఫండ్ ప్రక్రియ కొనసాగుతోందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా మనీ రిటర్న్ వచ్చిందని చెక్ చేసుకునేందుకు వెంటనే గూగుల్ పే యాప్‌ను చెక్ చేయాలని కోరాడు.

రూ.98,000 ఎలా పోయాయంటే?

Advertisement

ఫోన్ లోని వ్యక్తి మాటలు నమ్మిన బాధితురాలు.. తన గూగుల్ పే లో పిన్ నెంబర్ ఎంటర్ చేసిన అమౌంట్ చెక్ చేసుంది. ఇది జరిగిన నిమిషం వ్యవధిలోనే ఆమె బాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుండి ఏకంగా రూ. 98,000 కట్ అయ్యాయి. మధ్యాహ్నం 3:15 నుండి 3:16 గంటల మధ్య ఈ లావాదేవీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అక్టోబర్ 23న బాధితురాలు.. బెంగళూరులోని సెంట్రల్ సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలోనూ ఈ తరహా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

రీఫండ్ మోసాలతో జాగ్రత్త..

మరోవైపు రీఫండ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచించారు. గూగుల్ సెర్చ్‌లో కనిపించే నంబర్లను కాకుండా.. అధికారిక బ్లింకిట్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే ఫిర్యాదులు చేయాలని హితవు పలికారు. వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని.. రీఫండ్ డబ్బులు రావాలంటే యూపీఐ పిన్ (UPI PIN) కొట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హితవు పలుకుతున్నారు.

Advertisement

Also Read: బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

బ్లింకిట్‌లో రీఫండ్ కోరే విధానం

ఇదిలా ఉంటే బ్లింకిట్ యాప్‌లో రిఫండ్ ను పొందేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా యాప్ ఓపెన్ చేసి ‘హెల్ప్’ లేదా ‘కస్టమర్ సపోర్ట్’ సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ ‘మై ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకుని ఏ ఆర్డర్‌కు సంబంధించి సమస్య ఉందో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ‘నీడ్ హెల్ప్’ లేదా ‘రైజ్ ఎ కంప్లైంట్’ పై ట్యాప్ చేసి సమస్యను రిపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనీ రిఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని బ్లింకింట్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

Also Read: కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ సవాలు, పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు,మీడియా ముందుకు కూటమి అధినేతలు

Tags

Related News

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు వచ్చే వడ్డీ ఎంత?

జియో లిస్టింగ్ అదుర్స్.. అనంత్ స్పీచ్ తో రిలయన్స్ అధినేత ముకేష్ కంటతడి

ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

ఆఫీస్, షాపు లేకుండానే ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు.. ఈ GST నిబంధన గురించి తెలుసా?

పాలు, పండ్లు, కూరగాయలు ఏదైనా 5 స్టార్ హోటల్స్‌కు నేరుగా విక్రయించండి.. రైతులకు మంచి అవకాశం

హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉండాలి? తక్కువ ఈఎంఐ బెటరా? త్వరగా తీర్చేయడం మంచిదా?

దీపావళి వేళ గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆభరణాలు కొనకుండానే.. పసిడిపై లాభాలు పొందే 5 మార్గాలు!

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

Big Stories

Advertisement
×