Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లిస్తోంది. ఇప్పటికే పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తుండగా, తాజాగా మరికొన్ని రైళ్లకు సికింద్రాబాద్ లో హాల్టింగ్ రద్దు చేసింది. ముఖ్యంగా విశాఖ నుంచి వచ్చే రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ రైళ్లను చర్లపల్లి- అమ్ముగూడ- సనత్ నగర్ బైపాస్ మీదుగా దారి మళ్లించినట్లు వెల్లడించింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
సికింద్రాబాద్ లో హాల్టింగ్ రద్దు చేసిన రైళ్లు
⦿ లోకమాన్యతిలక్- విశాఖ (18520)
లోకమాన్యతిలక్- విశాఖ ఎక్స్ ప్రెస్ (18520) రైలు ఇకపై సికింద్రాబాద్ లో ఆగదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఈ రైలు రోజూ రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 8.20 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి విశాఖకు చేరకుంటుంది. ఏప్రిల్ 24 నుంచి ఇదే రైలు (18519) రైలు 12.35 గంటలకు చర్లపల్లి చేరుకుని 5 నిమిషాల పాటు ఆగుతుంది. 12.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి లోకమాన్య తిలక్ టెర్మినల్ కి వెళ్తుంది.
⦿ విశాఖ- సాయినగర్ (18503)
విశాఖ- సాయినగర్ ఎక్స్ ప్రెస్ (18503) రైలుకు కూడా ఇకపై సికింద్రాబాద్ లో ఆగదని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 24 నుంచి ఈ రైలు రాత్రి 8.10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అక్కడ 10 నిమిషాల పాటు ఆగుతుంది. అక్కడ 8.20 గంటలకు బయయల్దేరి షిర్డీకి వెళ్తుంది. అటు ఈనెల 25 నుంచి సాయినగర్- విశాఖ ఎక్స్ ప్రెస్ (18504) రైలు ఉదయం 8.45 గంటలకు చర్లపల్లి చేరుకుని, 10 నిమిషాలు ఆగుతుంది. 8.55 గంటలకు అక్కడి నుంచ బయల్దేరి విశాఖకు వెళ్తుంది.
⦿ సంబల్ పూర్-నాందేడ్ (20809)
సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్ (20809) రైలు కూడా ఇకపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగదు. ఏప్రిల్ 25 నుంచి ఈ రైలు ఉదయం 6.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడ 15 నిమిషాలు ఆగుతుంది. 7 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి నాందేడ్ కు వెళ్తుంది. ఈనెల 26 నుంచి నాందేడ్- సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్ (20810) రైలు రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి చేరుకుని, 15 నిమిషాల పాటు హాల్టింగ్ తీసుకుంటుంది. 9.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సంబల్పూర్ వెళ్తుంది అని తెలిపారు.
Read Also: దశాబ్దాలుగా ఫ్రీ ఫుడ్ అందిస్తున్న ఈ రైలు గురించి మీకు తెలుసా?
⦿ విశాఖ- నాందేడ్ (20811)
విశాఖ- నాందేడ్ ఎక్స్ (20811) కూడా సికింద్రాబాద్ కు వెళ్లకుండా డైవర్షన్ తీసుకుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ రైలు ఉదయం 6.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడ 15 నిమిషాల పాటు ఆగుతుంది. 7 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి నాందేడ్ కు వెళ్తుంది. ఈనెల 27 నుంచి నాందేడ్ – విశాఖ ఎక్స్ ప్రెస్ (20812) 9.15 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడ 15 నిమిషాల పాటు ఆగుతుంది. 9.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి విశాఖకు వెళ్లుంది. ప్రయాణీకులు ఈ రైళ్ల రూట్ మార్పు విషయాన్ని తెలుసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.
Read Also: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ, విజయవాడ మెట్రో ప్లాన్ కు నిధులు మంజూరు!