Pallavi Ramisetty : ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబ విలువలను తెలియజేసేలా తెరకెక్కించే ప్రతి సీరియల్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. అలాంటి సీరియల్లలో ఒకటి ‘ఇంటింటి రామాయణం’.. స్టార్ మా ఛానెల్ లో ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఉమ్మడి కుటుంబంలో జరిగే పరిస్థితులు.. కుటుంబ విలువలు తెలిసిన కోడలు తన కుటుంబం పరువును ఎలా కాపాడుతుందనేది ఈ నాటిక స్టోరీగా చూపించారు.. ఈ సీరియల్ లో అవని పాత్ర తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. పల్లవి రామిశెట్టి ఆ పాత్రలో నటించి ప్రశంసలు పొందింది. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించింది. ఆ సీరియల్స్ అన్ని మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ కూడా అదే విధంగా భారీ సక్సెస్ ని అందుకుంది. వరుసగా సక్సెస్ సీరియల్స్ లలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ పొందిన పల్లవి రామ్ శెట్టి రెమ్యూనరేషన్ ఎంత? అని చాలామంది తెలుసుకోవాలని గూగుల్లో తెగ వెతికేస్తుంటారు.. ఇంతకీ ఆమె ఒక్క రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..
పల్లవి రామిశెట్టి రెమ్యూనరేషన్..
బుల్లితెర పై భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్ మంచి స్టార్ నటిగా మారింది పల్లవి. తెలుగులో ఆడదే ఆధారం సీరియల్ తో పరిచయమైన పల్లవికి బుల్లితెర అనుష్కగా పేరుంది. ఈమెకు కూడా ప్రస్తుతం బుల్లితెర మీద ఫుల్లు డిమాండ్ ఉంది. పల్లవికి రోజుకు రూ. 55 వేల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటుంది. అంటే ఆ లెక్కన నెలకు ఆమె రూ. 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. ఇక వీటితో ఫుడ్, ట్రావెల్ ఖర్చులు ప్రొడక్షన్ భరిస్తుంది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏడాదికి సంపాదించేది ఈమె ఒక నెలలో సంపాదించడం మామూలు విషయం కాదు..
Also Read: వరల్డ్ వైడ్ వసూళ్ల సునామీ.. 100 కోట్ల క్లబ్ లోకి కామెడీ మూవీ…
పల్లవి గురించి చెప్పాలంటే..
పల్లవి 1993, అక్టోబరు 11న కృష్ణా జిల్లా, అవనిగడ్డలో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి, ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్‌తో పల్లవి వివాహం జరిగింది. అయితే ఆమె 10 వ తరగతి చదువుతున్న సమయంలోనే సీరియల్స్ అడిషన్స్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈటీవీ లో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి యాంకర్ గా సెలెక్ట్ అయ్యింది. అలా టీవీ రంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత నటిగా సీరియళ్ళలో నటించింది. భార్యామణి సీరియల్‌లో అలేఖ్య పాత్రలో, ఆడదే ఆధారం సీరియల్‌లో అమృత పాత్రలో నటించింది. ఆ తర్వాత పెళ్లి అయ్యాక వెంటనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఆ సమయంలో సీరియల్స్ కు గ్యాప్ తీసుకుంది. పల్లవి గ్యాప్ తీసుకోవడంతో ఆమెపై చాలా రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆమె తల్లిని విషయాన్ని అందరితో చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. సీరియల్స్ విషయానికి వస్తే.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తుంది.