Indian Railways: పాలక్కడ్ ఎక్స్ ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. లోయర్ బెర్త్ లో నిద్రపోతున్న మహిళా ప్రయాణీకురాలిపై మిడిల్ బెర్త్ విరిగి పడటంతో తీవ్రంగా గాయపడింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో రక్తంతో బట్టలన్నీ తడిసిపోయాయి. అయినప్పటికీ, రైల్వే అధికారులు కనీసం గంటసేపు ఆమెకు ప్రథమ చికిత్స అందించకపోవడం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. రక్తాన్ని ఆపేందుకు ఆమె తలపై ఓ కర్చీఫ్ ను పెట్టి అలాగే కూర్చోవాల్సి వచ్చింది. రైల్వే తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ సంఘటన మే 12 తెల్లవారుజామున తమిళనాడులోని మోరప్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. చెన్నైలోని ముగలివాక్కంకు చెందిన సూర్య (39) మే 11 రాత్రి పాలక్కాడ్ ఎక్స్ ప్రెస్ లోని S5 కోచ్ లో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తోంది. ఆమె తన స్వస్థలం మున్నార్ కు వెళుతోంది. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో, సూర్య దిగువ బెర్త్‌లో నిద్రిస్తుండగా, తోటి ప్రయాణీకుడు మిడిల్ బెర్త్ లో పడుకున్నాడు. ఆయన దిగి రెస్ట్ రూమ్ లోకి వెళ్లాడు. అకస్మాత్తుగా, మిడిల్ బెర్త్ దాని గొలుసు నుండి విడిపోయి నేరుగా ఆమె తలపై పడింది.
అందుబాటులో లేని ఫస్ట్ ఎయిడ్ కిట్
ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో పాటు సూర్య ఒక్కసారిగా గట్టిగా అరవడంతో తోటి ప్రయాణీకులు ఆమె బెర్త్ దగ్గర గుమికూడారు. అప్పటికే ఆమె తలకు గాయమై విపరీతంగా రక్తం కారుతోంది. సహాయం కోసం రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE)కు సమాచారం అందించారు. అతడు వచ్చి చూసి, రైల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదని చెప్పినట్లు బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు, ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నప్పటికీ, సమీపంలోని ఏ స్టేషన్‌లోనూ రైలును ఆపలేదు. సేలం స్టేషన్ కు చేరుకునే వరకు దాదాపు గంటన్నర పాటు ఆమె అలాగే ఉంది. రక్తం కారకుండా ఆపేందుకు తన చేతి రుమాలుతో గాయానికి అడ్డు పెట్టుకుంది. సేలం స్టేషన్ లో ప్రథమి చికిత్స అందించారు. గాయానికి మూడు కుట్లు వేశారు. తరువాత సూర్యను మున్నార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు.
Dear commuters ,
Kindly be cautious while travel in Sleeper coach,2A,3A .Because sometimes middle seats broke down and make severe injuries
12/5/2025 central to palakad express train @GMSRailway @AshwiniVaishnaw #IndianRailways #SouthernRailway pic.twitter.com/MwsVqbvQsi— Namathuneram_official (@Yuvrajvel1) May 13, 2025
అధికారుల నిర్లక్ష్యంపై బాధితురాలు ఆరోపణలు
రైల్వే అధికారుల నిర్లక్ష్యం, ప్రయాణీకుల భద్రతను పట్టించుకోవడంలో విఫలం అయ్యారని సూర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలులో కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేదని ఆరోపించింది. అటు మెడికల్ ప్రోటోకాల్ కు అనుగుణంగా రైల్వే అధికారులు వెంటనే వైద్య సహాయం కోసం ఏర్పాట్లు చేశారని రైల్వే అధికారులు తెలిపారు. “ప్రయాణికురాలి చికిత్స కోసం మొరప్పూర్ స్టేషన్‌లో దిగడానికి నిరాకరించింది. తర్వాత సేలం స్టేషన్ లో ఆమెకు అత్యవసర వైద్య సిబ్బంది చికిత్స అందించారు. స్టేషన్ మాస్టర్ ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఆమెను తదుపరి చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అటు ప్రయాణీకుడు మిడిల్ బెర్త్ లాకింగ్ మెకానిజమ్‌ను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
Read Also: ఆధార్ ఒక్కటే కాదు, వాటితోనూ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు, అసలు విషయం చెప్పిన ఆర్టీసీ ఎండీ!