సాధారణంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లేందుకు చాలా మంది బస్సులు, ఆటోల్లో వెళ్తారు. కొంత మంది క్యాబ్ లు, బైక్ రైడ్ లు బుక్ చేసుకుంటారు. ఒక్కో రైడ్ సాధారణంగా రెండు, మూడు కిలో మీటర్లకు మించి ఉంటుంది. దగ్గరగా ఉంటే మామూలుగా నడిచి వెళ్తారు. కానీ, ఓ మహిళ తాజాగా జస్ట్ 180 మీటర్ల దూరం వెళ్లేందుకు బైక్ రైడ్ బుక్ చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఓ మహిళ తాజాగా ఓలా బైక్ బుక్ చేసుకుంటుంది. దగ్గరలో ఉన్న ఓ బైకిస్టు ఆమె దగ్గరికి వస్తాడు. రైడ్ స్టార్ట్ చేసేందుకు ఆమెను ఓటీపీ అడుగుతాడు. ఆమె తనకు చెప్తుంది. ఆమె బుక్ చేసిన రైడ్ దూరం కేవలం 180 మీటర్లే ఉండటంతో ఆయన షాక్ అవుతాడు. డ్రాప్ లొకేషన్ తప్పుగా పెట్టారేమో చెక్ చేసుకోండి అని చెప్తాడు. కానీ, ఆమె తాను పెట్టింది సరైనదే అని చెప్తుంది. 180 మీటర్లు నడిచి వెళ్లొచ్చు కదా? బైక్ రైడ్ బుక్ చేసుకునేంత అవసరం ఏం వచ్చింది? అని అడుగుతాడు. ఆ మహిళ చెప్పిన మాట విని తను షాక్ అవుతాడు.
కుక్కల భయంతో రైడ్ బుకింగ్!
నడిచి వెళ్లాలని ఇష్టం ఉన్నా, దారి మధ్యలో కుక్కలు ఉన్నాయని చెప్తుంది. భయమేసి బైక్ రైడ్ బుక్ చేసుకున్నాను అంటుంది. ఆమె మాటలు విని అతడు ఆశ్చర్యపోతాడు. ఆమె, భయంలోనూ నిజం ఉందని భావించి, తనను బైక్ ఎక్కించుకుని, తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈ రైడ్ కోసం ఆమె అతడికి రూ. 19 రూపాయలు చెల్లిస్తుంది. ఈ రైడ్ కు సంబంధించిన వీడియోను rohitvlogster అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది.
Read Also: వామ్మో ఏనుగు షాపింగ్ చేస్తే ఇలా ఉంటుందా? నెట్టింట వీడియో వైరల్!
సోషల్ మీడియాలో వైరల్
ఈ షార్టెస్ట్ బైక్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఏకంగా 7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తే, మరికొంత మంది ఆ మహిళ సేఫ్ గా ఇంటికి వెళ్లేందుకు సాయం చేసిన బైకిస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. “ఒక అమ్మాయిని సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు థ్యాంక్స్ సోదరా” అని ఓ నెటిజన్ రాశాడు. “కుక్క కరిచిన తర్వాత ఇంజెక్షన్లు చేసుకోవడం కంటే, రూ. 19 ఖర్చు చేసి సేఫ్ గా ఇంటికి వెళ్లడం మంచిది” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కొంత మంది ఈ వీడియోను ‘టెక్నలాజియా’ అనే మాటతో మీమ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Also: మీకూ పిల్లల్లా మారిపోయి పాడ్ కాస్ట్ చెయ్యాలని ఉందా? జస్ట్ ఇలా చెయ్యండి చాలు!