Go-op Cooperative Railway UK: రైలు ఆలస్యం అయితే ఏం చేస్తాం.. వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటాం. కానీ, ఇంగ్లాండ్ లో ఓ వ్యక్తికి కోపం వచ్చి ఏకంగా సొంత రైల్వే సంస్థను స్థాపించాడు. ఇప్పుడు నైరుతి ఇంగ్లాండ్ లో అన్నీ ఆయన రైళ్లే నడుస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన రైల్వే సంస్థ పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
తోటి ప్రయాణీకులతో కలిసి..
సామాజిక సంస్థ సలహాదారు అలెక్స్ లారీ 2004లో తన ఫ్యామిలీతో కలిసి గ్లౌసెస్టర్ షైర్ నుంచి యెయోవిల్‌కు వెళ్లాలి అనుకున్నారు. కానీ, తను వెళ్లాల్సిన రైలు చాలా ఆలస్యం అయ్యింది. అదే ఈదురు గాలులు వీస్తున్నాయి. స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద చిరాకుగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చాలా ఇబ్బంది పడ్డాం. డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఫీలై, రైల్వే ప్రయాణం చేయాలనుకున్న తనకు మరింత విసుగు అనిపించింది. ఇంకా చెప్పాలంటే, ఆయన వెళ్లాల్సిన రైళ్లు ఏదీ కరెక్ట్ సమయానికి రాలేదు. ఆయన కోపంతో ఊగిపోయారు. అప్పుడే తనకు ఓ ఆలోచన వచ్చింది. రైలు కోసం తాను వెయిట్ చేయడం కాదు, తానే ఓ రైల్వే సంస్థను స్థాపిస్తే ఎలా ఉంటుంది? అని లోచించారు. ఆయనతో పాటు ఉన్న మిగతా రైల్వే ప్రయాణీకులను కలుపుకుని సొంత రైల్వే సంస్థకు శ్రీకారం చుట్టాని ప్రణాళికలు వేశారు.
పెట్టుబడి పెట్టిన కో-ఆప్ సూపర్ మార్కెట్ గ్రూప్
ఆలోచన రావడమే కాదు, ఆచరణ చాలా ముఖ్యం. కొత్త రైల్వే వ్యవస్థ స్థాపించడం అనేది మాటలు కాదు. అందుకే, అందరూ లారీ తన టీమ్ తో కూర్చొని చర్చించారు. ఇప్పటికే ఉన్న ట్రాక్‌ను ఉపయోగించి స్థానిక రైలు కనెక్షన్‌లను మెరుగుపరచడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. తన ఆలోచనలను విన్న కో-ఆప్ సూపర్ మార్కెట్ గ్రూప్ అతనికి పెట్టుబడి కోసం గ్రాంట్ ఇచ్చింది. కొత్త ‘ఓపెన్ యాక్సెస్’ రైల్వే ప్రొవైడర్ కోసం దరఖాస్తును ప్రారంభించడానికి ఇది గ్రాంట్ సరిపోయింది. ఆ తర్వాత UKలో తొలి సహకార రైల్వే అయిన గో-ఆప్ సంస్థ రూపు దిద్దుకుంది. ఫ్రాంచైజీలతో పోటీపడే ‘ఓపెన్ యాక్సెస్’ ఆపరేటర్ల హల్ ట్రైన్స్, LNER ఈస్ట్ కోస్ట్ మెయిన్ లైన్ మార్గంలోని నడిచే లోకో మోటివ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రోజు రోజుకు విస్తరిస్తున్న గో-ఆప్ రైల్వే సేవలు
గో-ఆప్ లో సంస్థలో ఇప్పుడు తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు. రోజు రోజుకు తన సేవలను విస్తరిస్తున్నది. రీసెంట్ గా సోమర్ సెట్‌లో ని టౌంటన్ నుంచి విల్ట్ షైర్ లోని వెస్ట్ బరీ వరకు ప్రధాన మార్గంలో రైళ్లను నడపడానికి గో-ఆప్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. పట్టణాల్లో సేవలను పెంచే ప్రయత్నం చేస్తున్నది. అదే సమయంలోయోవిల్, సాలిస్ బరీకి రైల్వే కనెక్షన్ ఇవ్వబోతున్నారు. వెస్ట్ బరీ నుంచి స్విండన్‌కు, టౌంటన్ నుంచి వెస్టన్ సూపర్ మేర్ కు కొన్ని రైల్వే సేవలను విస్తరించబోతున్నది.
గ్రేట్ వెస్ట్రన్ రైల్వేకు గట్టి పోటీ
ప్రస్తుతం బ్రిటన్ రైల్వే ఆపరేటింగ్ కంపెనీ గ్రేట్ వెస్ట్రన్ రైల్వే (GWR)కు గో-ఆప్ పోటీ ఇవ్వబోతున్నది. ప్రస్తుతం గో-అప్ లండన్ లోపల, బయటక కలిపి ఏకంగా 270 కి పైగా స్టేషన్లను కలిగి ఉంది. బిషప్స్ లైడార్డ్ లోని ప్రధాన సేవలతో కనెక్ట్ అవ్వడానికి వెస్ట్ సోమర్ సెట్ రైల్వే హెరిటేజ్ లైన్‌తో కలిసి పనిచేయాలని గో-అప్ భావిస్తున్నది. కల్లోంప్టన్, వెల్లింగ్టన్, సోమర్టన్, లాంగ్ పోర్ట్ లోని కొత్త స్టేషన్ల నిర్మాణానికి రెడీ అవుతున్నది. ప్రస్తుతం డీజిల్ లోకో మోటివ్ లతో సేవలు అందిస్తున్న గో-అప్ రానున్న రోజుల్లో బ్యాటరీలతో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది.
Read Also: తెలంగాణకు ఇప్పుడైనా కొత్త రైళ్లు వస్తాయా? కేంద్ర బడ్జెట్ పై రేవంత్ సర్కారు ఎన్నో ఆశలు!