Vishwak Sen: టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది విశ్వక్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి. మెకానిక్ రాకీ. గామి పర్వాలేదనిపించినా.. మిగతా రెండు సినిమాలు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. అయినా విశ్వక్ నిరుత్సాహపడకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం తాజాగా ఓ రత్తమ్మ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పెంచల్ దాస్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశ్వక్ మాస్ స్టెప్స్, ఆకాంక్ష అందాలు హైలైట్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో మొట్ట మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించాడు.
సినిమా విషయం పక్కన పెడితే.. విశ్వక్ క్యారెక్టర్ ఎప్పుడు మాస్ గానే ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడు. ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎక్కడ ఉన్నాం అనేది కూడా చూడడు. ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. దాని వలన ఎన్నోసార్లు వివాదాలను ఎదుర్కున్నాడు. మరెన్నో సినిమాలను వదులుకున్నాడు. సోషల్ మీడియాలో తన సినిమా గురించి కానీ, తన గురించి కానీ ఎవరైనా ఏదైనా అంటే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకుండా అస్సలు ఊరుకోడు.
Pooja Hegde: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుట్టబొమ్మ లిప్ కిస్ వీడియో.. అవకాశాల కోసమే.. ?
తాజాగా నేడు విశ్వక్ తిరుమలలో సందడి చేశాడు. సినిమా హిట్ అవ్వాలని స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నాడు. టీటీడీ అధికారులు విశ్వక్ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక మెట్ల మార్గంలో పైకి ఎక్కి స్వామివారిఆ ఆశీస్సులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ” లైలా సినిమాలో మోటు మాటలకు, డబుల్ మీనింగ్ లకు అక్కడ వెంకన్న స్వామి వారికి సారీ చెప్పి వచ్చేయండి సర్” అంటూ విశ్వక్ ను ట్యాగ్ చేశాడు. ఇక దీనిపై విశ్వక్ ఫైర్ అయ్యాడు.
ఒక సినిమాలో బ్రహ్మానందం సమాజం ఎలా తయారయ్యింది అని చెప్తున్న వీడియోను షేర్ చేస్తూ దేవుడిని మధ్యలోకి లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ వీడియోలో బ్రహ్మీ ఏం చెప్పాడంటే.. ” తప్పు మీది కాదయ్యా.. కాలానిది. భార్య వడ్డించేటప్పుడు ఇంకాస్త పెట్టు అంటే.. బయట ఉన్నవాడు ముద్దు అనుకుంటున్నాడే తప్ప ముద్ద అనుకోవడం లేదు. గదిలోకి వెళ్లి భజన చేసుకుంటాం అంటే తప్పు.. వేసుకుందాం అంటే తప్పు చేసుకుందాం అంటే తప్పు. వాళ్ల వాళ్ల సంస్కారాన్ని బట్టి నీతి, బూతు ఆధారపడి ఉంటాయి” అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.