Paytm Travel Pass: సాధారణంగా ఎక్కువ ప్రయాణాలు చేసే వారు ట్రావెల్ పాస్ తీసుకోవాలని భావిస్తారు. అలాంటి వారి కోసం పేటీఎం ట్రావెల్ పాస్ సబ్‌స్క్రిప్షన్ పై క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఇది మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాదు, మీ ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీని కోసం జస్ట్ రూ. 1,299 చెల్లించటం ద్వారా మీరు ఉచితంగా రద్దు, ప్రయాణ బీమా, రూ.15,200 వరకు సీటింగ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తరచుగా ప్రయాణించే వారు, ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Paytm ట్రావెల్ పాస్ ప్రత్యేకతలు
ఉచిత రద్దులు (4 సార్లు వర్తింపు) – ఏదైనా అనివార్య కారణాల వల్ల మీ ప్రయాణ ప్రణాళిక మారితే, మీ టికెట్ రద్దును రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
ప్రయాణ బీమా – ప్రయాణంలో ఊహించని సంఘటనల కోసం రక్షణ. మీ సామాను నష్టం, విమాన ఆలస్యం, ఇతర సమస్యల నుంచి మీ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచేందుకు బీమా కవరేజ్ అందుబాటులో ఉంది.
సీటింగ్ డిస్కౌంట్ – విమానంలో మీకు ఇష్టమైన సీటును ఎంపిక చేసుకోవడానికి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. విండో సీటా? లేక లెగ్‌రూం ఎక్కువగా ఉండే సీటా? మీరు దేనినైనా ఎంచుకోవచ్చు.
మూడు నెలల చెల్లుబాటు – ఈ పాస్ మూడునెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అంటే, మీరు ఈ కాలంలో ఎన్నిసార్లైనా ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు.
Read Also: Sony TV Offer: సోనీ 55 ఇంచ్ స్మార్ట్ HD టీవీపై రూ. 42 వేల …
Paytm ట్రావెల్ పాస్‌ను ఎలా పొందాలి
-Paytm యాప్ ఓపెన్ చేయండి.
-హోమ్ స్క్రీన్‌లో ‘ఫ్లైట్, బస్ & ట్రైన్’ విభాగానికి వెళ్లండి
-‘ట్రావెల్ పాస్’ ఎంచుకోండి
-రూ.1,299కి ట్రావెల్ పాస్ పొందండి’ క్లిక్ చేసి చెల్లింపు పూర్తి చేయండి.
-మీ ట్రావెల్ పాస్ ఆటో మేటిక్ గా యాక్టివేట్ అవుతుంది.
ప్రయాణ టికెట్ బుకింగ్ & ట్రావెల్ పాస్ ప్రయోజనాలను రీడీమ్ చేయడం ఎలా?
-Paytm యాప్ లో ‘ఫ్లైట్, బస్ & ట్రైన్’ విభాగానికి వెళ్లండి.
-మీ ప్రయాణ వివరాలను నమోదు చేసి, అందుబాటులో ఉన్న విమానాలను చూడండి.
-మీకు నచ్చిన విమానాన్ని ఎంచుకుని ‘Proceed’ క్లిక్ చేయండి.
-ఉచిత రద్దు, ప్రయాణ బీమా వంటి ప్రయోజనాలు మీకు కనిపిస్తాయి
-టికెట్ బుకింగ్ పూర్తి చేసేందుకు అవసరమైన వివరాలు నింపి, చెల్లింపును పూర్తి చేయండి
Paytm ట్రావెల్ బుకింగ్‌లో కొత్త మార్పులు
Paytm ఇటీవల Agodaతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా వినియోగదారులు దేశీయ, అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌లు కూడా చేసుకోవచ్చు. అలాగే, FLY91తో కలసి భారతదేశంలోని ప్రాంతీయ విమాన మార్గాల్లో ప్రయాణీకులకు మెరుగైన అవకాశాలను అందిస్తోంది. Paytm ట్రావెల్ ఇప్పుడు IATA గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్, అందుకే ప్రయాణికులకు ఉచిత రద్దులు, తక్షణ వాపసు, ప్రయాణ బీమా వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి.
ఈ ఆఫర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?
-వ్యాపార ప్రయాణికులు – తరచుగా ప్రయాణించే వారికి ఖర్చులను తగ్గించుకునేందుకు మంచి ఛాన్స్
-విద్యార్థులు – దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవారికి స్మార్ట్ ఎంపిక
-పర్యాటకులు – ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవచ్చు.
-కుటుంబాలు – ప్లానింగ్ మారినప్పుడు, రద్దు రుసుములు లేకుండా ప్రయోజనం పొందవచ్చు.