Actress Satya : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తమ కామెడీతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన వారంతా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న వారిలో కమెడీయన్ సత్య శ్రీ ఒకరు. ఈమె తల్లి కూడా గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్య ఒకప్పుడు చమ్మక్ చంద్ర స్కిట్ లో చేసింది. ప్రస్తుతం తన టాలెంట్ తో సినిమాల్లో నటిస్తుంది.. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి తాజాగా ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.. ఆ సినిమా గురించి ఇలాంటి విషయాలను షేర్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సత్య శ్రీ ఇంటర్వ్యూ..
జబర్దస్త్ షో చాలా మంది యాక్టర్స్ కు బెస్ట్ ప్లాట్ ఫామ్ అయ్యింది. తమ టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకుంటూ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. కొందరు ఏకంగా సినిమాలను డైరెక్ట్ చేసి సక్సెస్ అవుతున్నారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా రానిస్తున్న సత్య శ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. అందులో ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. హీరో నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో సత్య కానిస్టేబుల్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో నా పెట్టే తాళం అంటూ డబుల్ మీనింగ్ లో ట్రెండ్ అయ్యే ఈ పాటకు జబర్దస్త్ సత్య, సోనియా, నితిన్, బ్రహ్మాజీ ఇలా అందరూ పోలీస్ స్టేషన్లో ఖాకీ బట్టలతోనే పిచ్చి పిచ్చిగా స్టెప్పులు వేస్తారు. దానిపై విమర్శలు కూడా ఎదురయ్యాయి. దానిపై ఆమె ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది.
Also Read : ‘అఖండ 2’ క్రేజీ అప్డేట్..బాలయ్యకు గురువుగా మరో హీరో..?
శేఖర్ మాస్టర్ వల్లే చేశాను..
సత్య మాట్లాడుతూ..ఆ పాటకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టలేక పదిహేను టేకులు తీసుకుందట. ఈ పాటకు ముందు ముంబై మోడల్స్ తీసుకుందామని వక్కంతం వంశీ అనుకున్నాడట. వల్గర్‌గా ఏం చూపించడం లేదు కదా? ఎక్స్‌పోజ్ చేయమని చెప్పడం లేదు కదా? తెరపై నీకు అలా అనిపించదు అని వక్కంతం వంశీ కన్విన్స్ చేశాడట. శేఖర్ మాస్టర్ సైతం తనకు అర్థమయ్యేలా చెప్పాడు. ఆ సాంగ్ చెయ్యలేనని ఎంత చెప్పిన వినకుండా బలవంతంగా చేయించారు. శేఖర్ మాస్టర్ వల్లే నేను చేశాను. నాకు రాదు అన్నా కూడా వదల్లేదు. హీరో నితిన్ కూడా పొగిడేశారు. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ నాకు ఇప్పటికీ అది చేదు జ్ఞానపకం అనిపించింది. ఇక మీదట ఎవరు చెప్పిన అలాంటి బూతు మీనింగ్ వచ్చే పాటలు చెయ్యనని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు స్పెషల్ ఈవెంట్స్ లలో మెరుస్తుంది.