OTT Movie : ఓటీటీలోకి ఎన్నో రకాల జోనర్ సినిమాలు వస్తుంటాయి. అయితే ఓటీటీ రిలీజ్ అయ్యే మలయాళ సినిమాలకు ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. వాటిలో కొన్ని జోనర్స్‌కు మాత్రమే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు మంచి కాన్సెప్ట్ ఉన్న బోల్డ్ మూవీస్‌ను కూడా ఎంకరేజ్ చేస్తారు. గతేడాది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఈ మలయాళ బోల్డ్ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ మూవీకి బాలీవుడ్ నటి రిచా చద్దా నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ (Girls Will Be Girls). 2024 లో విడుదలైన ఈ మూవీకి శుచి తలాటి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రీతి పాణిగ్రాహి, కని కుస్రుతి, కేశవ్ బినోయ్ నటించారు. ఈ మూవీ హిమాలయ పర్వత ప్రాంతంలోని, ఒక బోర్డింగ్ స్కూల్‌లో సెట్ చేయబడింది. టీనేజర్ మీరా ఒక కొత్త విద్యార్థితో ప్రేమలో పడి, వయసులో వచ్చే కోరికల పై మనసు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె తల్లితో కూడా విభేదాలు వస్తాయి. ఈ మూవీ 2024 సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి, పీపుల్స్ అవార్డుతో పాటు ఇతర పురస్కారాలను గెలుచుకుంది. డిసెంబర్ 18, 2024 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
18 ఏళ్ల మీరా అనే ఒక అమ్మాయి చదువులో రాణిస్తూ, స్కూల్ నియమాలను కఠినంగా పాటిస్తూ ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన విద్యార్థి శ్రీనివాస్ పట్ల ఆమెకు ఆకర్షణ కలుగుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభిస్తారు. మీరా తన యవ్వనంలో వచ్చే ఫీలింగ్స్ ను అన్వేషించడం మొదలుపెడుతుంది.ఈ సమయంలో మీరా తల్లి అనిలా, కూతురి జీవితంలో చురుకుగా జోక్యం చేసుకుంటుంది. అనిలా తన యవ్వనంలో ఎన్నో అవకాశాలను కోల్పోయిన మహిళ. ఆమెలోని అసంతృప్తి మీరా జీవితంపై ప్రభావం చూపుతుంది. శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండటం ద్వారా, అనిలా తన కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందాలని ప్రయత్నిస్తుంది. ఇది మీరా, అనిలా మధ్య సంఘర్షణకు దారితీస్తుంది. అనిలా శ్రీనివాస్‌తో సన్నిహితంగా మెలగడం మీరాకు ఇష్టం లేకపోవడంతో, తల్లి, కూతురు సంబంధంలో భేదాభిప్రాయం పెరుగుతుంది. మరోవైపు స్కూల్‌లో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలపై అనుచితంగా ప్రవర్తించడాన్ని మీరా గమనించి, వారిపై యాజమాన్యానికి రిపోర్ట్ చేస్తుంది. దీని ఫలితంగా ఆమెను వెంబడించిన అబ్బాయిల నుండి తప్పించుకోవడానికి ఆమె హాస్టల్‌లో దాక్కుంటుంది. భయం తో తల్లిని పిలిచి ఇంటికి తీసుకెళ్లమని కోరుతుంది. ఇంటికి చేరిన తర్వాత, శ్రీనివాస్ మీరా, అనిలాతో కలిసి సమయం గడుపుతాడు. చివరికి, మీరా తన తల్లి భావాలను అర్థం చేసుకుంటుదా ? వారి మధ్య సంబంధం మెరుగుపడుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.