Varanasi Tour: వారణాసి గొప్ప మత పరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్న నగరం. వారణాసిలో బనారస్ , దేవాలయాలు , ఘాట్లు , మత విశ్వాసాలకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి . ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడి అందమైన దృశ్యాలు, గొప్ప దేవాలయాలను చూడటంలో మైమరచిపోతారు. సమ్మర్ లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు, బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్నావారు.. వారణాసికి వెళ్లొచ్చు. తక్కువ ఖర్చులోనే వారణాసి టూర్ పూర్తయిపోతుంది. ఇంతకీ బనారస్‌లో తప్పకుండా చూడాల్సిన టాప్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1)ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహాకాళి ఆలయం:
బనారస్‌కు వచ్చి కాశీ విశ్వనాథ ఆలయాన్ని తప్పకుండా చూడాలి. బనారస్ కు ఎవరు ముందుగా వచ్చినా ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఈ ఆలయం దాదాపు 3500 సంవత్సరాల పురాతనమైంది. అంతే కాకుండా ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. దీనిని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. మీరు మీ బనారస్ పర్యటనను ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ప్రారంభించాలి. అది మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
2) గంగా హారతి:
బనారస్‌లోని గంగా హారతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ హారతి చూడాలనుకుంటే అస్సీ ఘాట్‌కి వెళ్ళాలి. గంగా హారతి ఉదయం, సాయంత్రం అస్సీ ఘాట్ వద్ద జరుగుతుంది. అయితే.. ఉదయం గంగా హారతి చూడటానికి మీరు తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేవాలి. సాయంత్రం హారతి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య జరుగుతుంది. ఈ హారతిని చూడటానికి సాయంత్రం 4 గంటల నుండి అస్సీ ఘాట్‌కు వేలాది గుమిగూడడం ప్రారంభిస్తారు. అస్సీ ఘాట్ దగ్గర, ఒక రావి చెట్టు కింద శివుని విగ్రహం ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని దానిని చూడటానికి చాలా మంది వస్తుంటారు. ఇది మీకు గొప్ప అనుభూతిని కూడా అందిస్తుంది.
3) ఇసుకరాయి కోట:
మీరు ఇసుక రాయి కోటను చూడాలనుకుంటే వారణాసిలోని రాం నగర్ ప్రాంతానికి వెళ్లాలి. ఈ కోటను రాజా బల్వంత్ సింగ్ 1750 ADలో నిర్మించాడు. ఈ కోటలో.. మీరు వేద వ్యాసుడి ఆలయం, రాజు నివాసం, మ్యూజియంను కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం ఒక్క సారి చూసినా మీరు ఎప్పటికీ మరచిపోలేరు. వారణాసి టూర్ వచ్చిన చాలా మంది ఈ కోటను చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
Also Read: ఒక్క రోజులో హైదరాబాద్ ట్రిప్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు !
4) దశాశ్వమేధ ఘాట్:
మీరు వారణాసికి వెళ్తే మాత్రం దశాశ్వమేధ ఘాట్ ని తప్పక చూడండి. ఇక్కడ బ్రహ్మ దశాశ్వమేధ యాగం చేసాడని చెబుతారు. అందుకే దీనికి దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా, గంగా హారతి కోసం ఉదయం , సాయంత్రం జనాలు గుమి గూడతారు. ఇక్కడ గంగా హారతిని చూడటానికి చాలా మంది ఇష్ట పడతారు. దీంతో పాటు.. ఈ ఘాట్ వద్ద అనేక మత పరమైన ఆచారాలు కూడా నిర్వహిస్తారు.